2008 సంవత్సరానికి TV నంది అవార్డులను మార్చి 2వ తారీఖున ప్రకటించారు. డాక్యుమెంటరీ విభాగంలో TV9 వారి “మహాకవి శ్రీశ్రీ”కు అవార్డు వరించింది. మార్చి ౩వ తారీఖున TV9లో ఇది ప్రసారమయ్యింది కూడా (బహుశా పున: ప్రసారమేమో). TV9 వారు ఆ వీడియోను youtubeలో పెట్టారు.

http://www.youtube.com/watch?v=GVabEg6Ddqg

ఆ డాక్యుమెంటరీలో వ్యక్తిగత జీవిత విశేషాలజోలికి వెళ్ళకుండా కవిగా శ్రీశ్రీ ప్రస్థానం ఆవిష్కరించారు. పలువురి అభిప్రాయాలను చూపించారు. ఇతర భాషా రచయతల అభిప్రాయలు కూడా సేకరిస్తే బాగుండేది. “ఆకలిరాజ్యం” చిత్రంలోని కమల్ హాసన్ నటించిన సన్నివేశాలను విరివిగా వాడుకున్నారు. ఆ కాలంలో శ్రీశ్రీ గడి-నుడి నడిపేవారని గుర్తు. కాని ఆ విషయం ఈ డాక్యుమెంటరీలో ప్రస్తావించినట్లులేదు. పాత కాలం పత్రికల నుంచి మరిన్ని బొమ్మలు, విషయాలు చేర్చివుంటే మరీ బాగుండేది. ఐనా శ్రీశ్రీ తెలంగాణ పోరాటాన్ని బలపరచలేదని వంటి కొన్ని క్రొత్త విషయాలు తెలిసాయి. శ్రీశ్రీ చమత్కారాల (ఆలు కొందరికి బహువచనం లాంటివి) ప్రస్తావన లేదు. అందుకేనేమో శ్రీశ్రీ పైన పూర్తి  స్థాయి డాక్యుమెంటరీ రావాలని ఈ TV డాక్యుమెంటరీలో కోరారు.

ఇతర నంది TV Film Awards-2008:

Tele film విభాగం:

 1. “విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు” – దూరదర్శన్ – బంగారు నంది
 2. గంటల బండి – వెండి నంది

TV film విభాగం (Tele film, TV film అని ఎలా విభజన చేసారో అర్థం కాలేదు):

బంగారు నందులు:

 1. తెలుగు వెలుగు (Best Feature)
 2. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ (మెగా సీరియల్)
 3. చిన్నారి (డైలీ సీరియల్)
 4. పిల్లల చిత్రాల విభాగం ఏవీ అర్హత సంపాదించలేదు
 5. మహాకవి శ్రీశ్రీ (డాక్యుమెంటరి)
 6. కచ్రా (సామాజిక స్పృహ కలిగిన చిత్రం)
 7. వేద గణితం (Educational film)

ఇతర అవార్డులు:

 1. P. ఉదయభాస్కర్ – ఉత్తమ దర్శకుడు (మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ)
 2. మీనా – ఉత్తమ నటి (మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ)
 3. మనోజ్ – ఉత్తమ సహాయ నటుడు (రాధా మధు)
 4. లహరి – ఉత్తమ సహాయ నటి (రాధా మధు)
 5. చలపతి రాజు – ఉత్తమ హాస్యనటుడు (ఋణానందలహరి)
 6. మధు మణి – ఉత్తమ హాస్య నటి (యువ)
 7. రంగనాథ్ – ఉత్తమ ప్రతినాయకుడు (శృతి)
 8. అభిషేక్ రామ – ఉత్తమ బాల నటుడు (కచ్రా)
 9. గాయత్రి – ఉత్తమ బాలనటి (గంటల బండి)
 10. మీర్ హుస్సేన్ – ఉత్తమ మొదటి చిత్రం దర్శకుడు – (చి.లాక్స్.సౌ. స్రవంత)
 11. P. చంద్రశేఖర్ అజాద్ – ఉత్తమ స్క్రీన్ ప్లే (రాధా మధు)
 12. ఆకెళ్ల సూర్యనారాయణ – ఉత్తమ కథా రచయత (నీలో సగం)
 13. CS రావు – ఉత్తమ మాటల రచయత  (విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు)
 14. అనంత్ శ్రీరాం – ఉత్తమ గీత రచయత  (తూర్పు వెళ్ళే రైలు- ”మొన్న ఎదురు చూసా.. ”)

References:

 1. TV9
 2. http://www.hindu.com/2010/03/03/stories/2010030356150200.htm

tulpan_ver31

2008లో వచ్చిన ఈ కజకిస్థాన్ సినిమా చాలా అవార్డులు గెలుచుకుంది.గోవాలో జరిగిన ముఫ్ఫై తొమ్మిదివ ‘IFFI’ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఈ చిత్రం బంగారు నెమలి(గోల్డెన్‌ పీకాక్‌) పురస్కారాన్ని గెలుచుకుంది. జర్మనీ, స్విట్జర్లాండ్‌, రష్యా, పోలెండ్‌ సహకారంతో దీన్ని నిర్మించారు. Sergei Dvortsevoy ఈ చిత్రానికి దర్శకుడు. అప్పటి సోవియట్‌ యూనియన్‌లో భాగమైన కజకస్థాన్‌లో నేవీ శిక్షణ పొందిన ఓ యువకుడి కథ (క్రింద trailerలో కొంత చూడొచ్చు). ఈ చిత్రం 2008 Oscar Foreign Language విభాగంలో కజికిస్దాన్ నుండి నామినేట్ చేయబడింది. ఈ చిత్రం DVD రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నా. ఈ సినిమా కు సంబధించిన కొన్ని వీడియోలు ఇక్కడ చూడొచ్చు:

సినిమా ట్రైలర్

దర్శకుడితో ఇంటర్వ్యూ (భాగం-1)

దర్శకుడితో ఇంటర్వ్యూ (భాగం-2)