నాగిరెడ్డి మరియు చక్రపాణి భాగస్తులైన విజయా పిక్చర్స్ సంస్థ ఎన్నో మంచి సినిమాలను అందించింది. వారి మిస్సమ్మ, గుండమ్మ కథ, అప్పు చేసి పప్పు కూడు మొదలైనవి తెలుగు సినీచరిత్రలో మైలురాళ్ళు. Webలో వారి నిర్మాణ వివరాలు కోసం వెతికితే 1962 లో తీసిన గుండమ్మ కథ కథ తర్వాత 1973 లో గంగ మంగ తీసేవరకు ఏ సినిమా తీసినట్టు కనిపించలేదు.

ఈ మధ్య “ద్రోహి”అను ఒక నలుపు-తెలుపు చిత్రం చూసాను. 1970లో నిర్మించబడిన ఈ చిత్రానికి దర్శకుడు బాపయ్య. నిర్మాత డి. రామానాయుడు. జగ్గయ్య, వాణిశ్రీ లు తండ్రి కూతుళ్లుగా నటించారు. రామానాయుడు కూడా 1నిమిషం cameo role (వాణిశ్రీ భర్తగా)లో కనిపిస్తారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ చిత్రం విజయా&సురేశ్ కంబైన్స్ బ్యానర్ కింద తీసారు. “విజయా” వారి జెండాతో ఇద్దరి అబ్బాయిల బొమ్మే ఈ బ్యానరు చిహ్నం. Titlesలో ఈ బ్యానర్ చూపిస్తున్నపుడు విజయా వారి బ్యానర్ సంగీతమే వాడారు. మరి “విజయా” వారు, సురేశ్ ప్రొడక్షన్స్ వారు కలిసి తీసారేమో!

vijayaSuresh