sppl_logo_main

ద్రోహి సినిమా నిర్మాణంలో విజయా వారి భాగస్వామ్యం వుందా అని ఒక టపా కొన్నాళ్ళ క్రితం వ్రాసాను.  అది చదివి ceenuగారు స్పందించి నాకు mail చేసారు. ఆ mail సారాంశం ఇక్కడ పెడ్తున్నాను.

విజయాసురేష్ బ్యానర్లొ జెండాపట్టుకుని వున్న పిల్లలు ఎవరో తెలుసా? సురేశ్‌బాబు వెంకటేష్‌లు. ఆతర్వాత సురేష్ ప్రొడక్షన్స్ పెట్టినపుడు “S” పైన వెంకటేష్‌ని”P”పైన సురేష్‌ని నిలబెట్టి లోగో తయారుచేయించారు రామానాయుడు. చాలాకాలం”S”పైన సురేష్‌ని నిలబెట్టుండాల్సిందని, కనీసం సురేశ్ బాబు పేరు “S”అక్షరంతో match అయ్యేది కదా అని  బాధపడ్డరట.ఈమద్యేవరో నాయుడుగారికి ముందుగానే ఊహించి వెంకటేష్ స్టారు (Star) సురేష్ ప్రొడ్యుసర్ (Producer) అవుతారని అలాపెట్టరని చమత్కరించారట .అప్పుడు నాయుడుగారు ఆరోజు చేసినది తప్పు కాదనుకుని సంతోష పడ్డాడట.

ఐతే ద్రోహి సినిమా బహుశా విజయా వారి భాగస్వామ్యంతో తీసినదే అయ్యుండొచ్చు. ఎందుకంటే అప్పుడప్పుడే రామానాయుడు గారు సినిమాలు నిర్మించడం మొదలుపెట్టారు కాబట్టి ఆర్థికంగా అంతగా బలంగా వుండివుండకపోవచ్చు.  ఇంకో విషయం ఏమిటంటే రామానాయుడు గారిని తెలుగు సినిమా  వాళ్ళంతా డాడీ అంటారు (డా|| డి. రామానాయుడు లో మొదటి రెండు అక్షరాలు). మరి ఇన్ని సినిమాలు తీసిన ఆయన నిజంగా తెలుగు సినిమా డాడీనే కదా!

నాగిరెడ్డి మరియు చక్రపాణి భాగస్తులైన విజయా పిక్చర్స్ సంస్థ ఎన్నో మంచి సినిమాలను అందించింది. వారి మిస్సమ్మ, గుండమ్మ కథ, అప్పు చేసి పప్పు కూడు మొదలైనవి తెలుగు సినీచరిత్రలో మైలురాళ్ళు. Webలో వారి నిర్మాణ వివరాలు కోసం వెతికితే 1962 లో తీసిన గుండమ్మ కథ కథ తర్వాత 1973 లో గంగ మంగ తీసేవరకు ఏ సినిమా తీసినట్టు కనిపించలేదు.

ఈ మధ్య “ద్రోహి”అను ఒక నలుపు-తెలుపు చిత్రం చూసాను. 1970లో నిర్మించబడిన ఈ చిత్రానికి దర్శకుడు బాపయ్య. నిర్మాత డి. రామానాయుడు. జగ్గయ్య, వాణిశ్రీ లు తండ్రి కూతుళ్లుగా నటించారు. రామానాయుడు కూడా 1నిమిషం cameo role (వాణిశ్రీ భర్తగా)లో కనిపిస్తారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ చిత్రం విజయా&సురేశ్ కంబైన్స్ బ్యానర్ కింద తీసారు. “విజయా” వారి జెండాతో ఇద్దరి అబ్బాయిల బొమ్మే ఈ బ్యానరు చిహ్నం. Titlesలో ఈ బ్యానర్ చూపిస్తున్నపుడు విజయా వారి బ్యానర్ సంగీతమే వాడారు. మరి “విజయా” వారు, సురేశ్ ప్రొడక్షన్స్ వారు కలిసి తీసారేమో!

vijayaSuresh