పాఠకుల అభిమానాన్ని చూరగొన్న శ్రీ ముళ్లపూడి వెంకటరమణ గారి కోతికొమ్మచ్చి ఇప్పుడు శ్రవణ పుస్తకంగా వచ్చేస్తోంది. ఈ పుస్తకాన్ని స్వరపరిచింది మరెవరో కాదు బాపు రమణల చిరకాల మిత్రుడు, తెలుగు వారి అభిమాన గాయకుడు శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు. ప్రస్తుతం ఐదు అధ్యాయాలు అందుబాట్లో వున్నాయి. బహుశా తెలుగు సాహిత్య చరిత్రలో ఇదే మొదటి శ్రవణ పుస్తకం అయ్యుండొచ్చు. ఈ అపూర్వమైన నిధిని మీ సొంతం చేసుకోవాలనుకుంటే  http://www.kothikommachi.com/ ను సందర్శించండి (కొన్ని samples ఉచితంగా వినవచ్చు!).

RamanaBapu

(జనవరి 25, 2009న కోతి కొమ్మచ్చికి గోవిందరాజు సీతాదేవి పురస్కారం ప్రధానం చేసిన సందర్భంగా రమణగారు, బాపు గారు)

రమణగారు ప్రతివారం స్వాతి వారపత్రికలో వ్రాసే కోతికొమ్మచ్చి గురించి అందరికి తెలుసు. ఈ వారం కోతికొమ్మచ్చిలో డబ్బింగు గురించి ఒక విలువైన వాక్యం వ్రాసారు:     “డైలాగులో పఫబభమ లకి పేచీ కాని తథదధన లకి లిప్ సింక్ కి సమస్యేలేదు”