బొమ్మ: జయదేవ్ దంపతులు, శ్రీ రాంపా, కార్టూనిస్టుల పిల్లలు (కుందేలు ఆకారంలో వున్న కేకు!)

డిసెంబరు 20వ తేది (ఆదివారం) జలవిహార్ లో “గ్లాచ్చు మీచ్యూ” పుస్తకావిష్కరణ, జయదేవ్ గారి 70వ జన్మదిన వేడుక కార్టూనిస్టులు, ఆర్టిస్టుల మధ్య  జరిగాయి. ఆ సంబరాలలో పాలుపంచుకోవాలని నేను హైదరాబాదు వెళ్ళాను. అక్కడ ఆర్టిస్టులందరినీ ఒక్కసారి చూసే భాగ్యం కలిగింది. ఆ వేడుకల video ఇక్కడ చూడొచ్చు (video 7 ఎందుకో పనిచేయట్లేదు).

మొదట జయదేవ్ గారి 70వ జన్మదిన వేడుక రాంపా గారి ఆధ్వర్యంలో సరదాగా సా…గింది. తర్వాత పుస్తకావిష్కరణ అయ్యింది. తర్వాత జయదేవ్ గారు వారి సందేశాన్ని అందించారు (పై లింకులో video 8). మధ్యాహ్నం మూడుగంటలకు మొదలైన ఈ కార్యక్రమం ఏడు గంటలవరకు సాగిందంట.  నా రైలు ఏడు గంటలకే కాబట్టి ఐదున్నర వరకే  (జయదేవ్ గారి సందేశం పూర్తి అయ్యేవరకు) వుండగలిగాను.

అవును కార్టూనిస్ట్ జయదేవ్ గారు, మన జయదేవ్ గారు వ్రాసుకున్న స్వగతం (దాదాపు 120 personal stories) “గ్లాచ్చు మీచ్యూ – నా పర్సనల్ స్టోరీలు” అను పుస్తకంగా త్వరలో విడుదల కాబోతున్నది. ఈ పుస్తకానికి ముఖచిత్రం, అట్ట డిజైను చేసింది శ్రీ అన్వర్. ముందుమాట వ్రాసింది శ్రీమతి మాలతీ చందూర్. ఈ పుస్తకాన్ని ప్రచురించింది జయదేవ్ గారి చిరకాల మిత్రులు ఒకప్పటి మా బడి పత్రికతో తెలుగు విద్యావిధానంలో మార్పు తెచ్చిన చౌడెపల్లె ప్రచురణకర్తలు (విజయవాణి ప్రింటర్స్) : VNR Book World వారు.

ఇక పుస్తకంలోని రెండు పేజీలు ఈ క్రింది బొమ్మలో చూడండి.

చదివారు కదా. బాగున్నాయి కదా కథలు. ఆలస్యమెందుకు మీకోసం  కాపీలు రిజర్వుచేసుకోవడానికి పై బొమ్మలో వున్న చిరునామాను సంప్రదించండి.

1964-02-12-p43-andPba-jayadev

1964, ఫిబ్రవరి 12 సంచిక ఆంధ్రప్రభ వారపత్రిక 43వ పేజీలో ప్రచురింపబడ్డ జయదేవ్ గారి కార్టూన్ తో దీపావళి శుభాకాంక్షలు.

1962-10-19-p31-andPtk-jayadev-cartoon

19 అక్టోబరు1962 ఆంధ్రపత్రిక సంచిక 31వ పేజీలో ప్రచురింపబడ్డ జయదేవ్ గారి కార్టూన్.