Joe Ranft ఒక animator. Disney, Pixarలతో రచయతగా, storyboard artistగా, ఎన్నో animation charactersకు స్వరదాతగా పలు సినిమాలు చేసాడు. The Lion King, Toy Story, Finding Nemo , Corpse Bride సినిమాలు Joe Ranft filmographyలో భాగమే. ఐదేళ్ళ క్రితం ఒక రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ సంవత్సరం ఆయన పుట్టినరోజు సందర్భంగా సాటి కళాకారుడు The Princess and the Frog చిత్ర దర్శకుడు John Musker అర్పించిన నివాళి ఈ వీడియో.  Story sktechలతో ఈ చిన్న వీడియో చివరికొచ్చేసరికి నా కళ్ళు చెమర్చాయి. తప్పక చూడవలసిన వీడియో ఇది.

అణు శాస్త్రవేత్త హోమి భాభా గురించి తెలియని సైన్స్ విద్యార్థి వుండడు. మన దేశం సాంకేతికంగా అభివృద్ధి చెందడానికి కృషి చేసిన శాస్త్రవేత్తలలో అగ్రగణ్యుడు. ఆయన మంచి artist అని నాకు ఈ మధ్యనే తెలిసింది. తెలిసి ఎందుకో చాలా సంబరపడ్డాను. ఆయన వేసిన ప్రముఖ భరతనాట్య కళాకారిణి శాంత రావు బొమ్మ పైన చూడవచ్చు.

Reference:

http://www.thehindu.com/fr/2010/02/19/stories/2010021950860300.htm

ఈ రోజు (28 మార్చి 2010) సాక్షి దిన పత్రిక “ఫ్యామిలీ” అనుబంధంలో దర్శక దిగ్గజం మణిరత్నంపైన ఒక వ్యాసం ప్రచురించారు. చాలా స్పూర్తిదాయకంగా వుంది. మొదటి నాలుగు చిత్రాలు flopఐనా ఐదవ సినిమా (మౌనరాగం) తను తీయాలనుకున్న విధంగానే తీసి విజయం సాధించాడు. మౌనరాగం సినిమా “నెంజత్తై కిల్లాదే” అను J. మహేంద్రన్ సిన్మా inspirationతో తీసిందంట (బాపు గారి సీతమ్మ పెళ్లి కూడా J. మహేంద్రన్ గారి “ముల్లుం మలరుం” సినిమా ఆధారంగా తీసిందే). నాకెందుకో ఆ మొదటి నాలుగ్ సినిమాలు ఎందుకు flop అయ్యాయో తెలుసుకోవాలని వుంది. ఆ నాలుగు సినిమాలు: (మరింత…)

Babe సినిమాలో జంతువులు మాట్లాడటం మనం చూసాము. ఆ visual effectsకు Oscar award కూడా వచ్చింది. అలా జంతువులు మాట్లాడటం వెనుక రహస్యం ఏమిటో తెలుసుకోవాలని వుంది కదా.  ఆ visual effectsపైన ఒక మంచి వీడియో ఇది: (మరింత…)

మార్చి 11 (2010) నాడు San Franciscoలో జరిగిన Game Developers Conference (GDC)లో Silent Hill Video Game ప్రముఖ Sound Designer Akira Yamaoka ప్రసంగంలోని ఆసక్తికరమైన అంశాలు ఇవి. ఈ ప్రసంగంలో Sound design లోని లోతుపాతులు కొన్ని తెలుసుకోవచ్చు. ప్రముఖ architect Ludwig Mies van der Rohe అన్నట్టు “God is in the detail of the arts.”. ఈ ప్రసంగం Video Games గురించి చేసినా, సినిమాలోని Sound designకి కూడా అన్వయించుకోవచ్చు. (మరింత…)