video


Joe Ranft ఒక animator. Disney, Pixarలతో రచయతగా, storyboard artistగా, ఎన్నో animation charactersకు స్వరదాతగా పలు సినిమాలు చేసాడు. The Lion King, Toy Story, Finding Nemo , Corpse Bride సినిమాలు Joe Ranft filmographyలో భాగమే. ఐదేళ్ళ క్రితం ఒక రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ సంవత్సరం ఆయన పుట్టినరోజు సందర్భంగా సాటి కళాకారుడు The Princess and the Frog చిత్ర దర్శకుడు John Musker అర్పించిన నివాళి ఈ వీడియో.  Story sktechలతో ఈ చిన్న వీడియో చివరికొచ్చేసరికి నా కళ్ళు చెమర్చాయి. తప్పక చూడవలసిన వీడియో ఇది.

2008 సంవత్సరానికి TV నంది అవార్డులను మార్చి 2వ తారీఖున ప్రకటించారు. డాక్యుమెంటరీ విభాగంలో TV9 వారి “మహాకవి శ్రీశ్రీ”కు అవార్డు వరించింది. మార్చి ౩వ తారీఖున TV9లో ఇది ప్రసారమయ్యింది కూడా (బహుశా పున: ప్రసారమేమో). TV9 వారు ఆ వీడియోను youtubeలో పెట్టారు.

http://www.youtube.com/watch?v=GVabEg6Ddqg

ఆ డాక్యుమెంటరీలో వ్యక్తిగత జీవిత విశేషాలజోలికి వెళ్ళకుండా కవిగా శ్రీశ్రీ ప్రస్థానం ఆవిష్కరించారు. పలువురి అభిప్రాయాలను చూపించారు. ఇతర భాషా రచయతల అభిప్రాయలు కూడా సేకరిస్తే బాగుండేది. “ఆకలిరాజ్యం” చిత్రంలోని కమల్ హాసన్ నటించిన సన్నివేశాలను విరివిగా వాడుకున్నారు. ఆ కాలంలో శ్రీశ్రీ గడి-నుడి నడిపేవారని గుర్తు. కాని ఆ విషయం ఈ డాక్యుమెంటరీలో ప్రస్తావించినట్లులేదు. పాత కాలం పత్రికల నుంచి మరిన్ని బొమ్మలు, విషయాలు చేర్చివుంటే మరీ బాగుండేది. ఐనా శ్రీశ్రీ తెలంగాణ పోరాటాన్ని బలపరచలేదని వంటి కొన్ని క్రొత్త విషయాలు తెలిసాయి. శ్రీశ్రీ చమత్కారాల (ఆలు కొందరికి బహువచనం లాంటివి) ప్రస్తావన లేదు. అందుకేనేమో శ్రీశ్రీ పైన పూర్తి  స్థాయి డాక్యుమెంటరీ రావాలని ఈ TV డాక్యుమెంటరీలో కోరారు.

ఇతర నంది TV Film Awards-2008:

Tele film విభాగం:

 1. “విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు” – దూరదర్శన్ – బంగారు నంది
 2. గంటల బండి – వెండి నంది

TV film విభాగం (Tele film, TV film అని ఎలా విభజన చేసారో అర్థం కాలేదు):

బంగారు నందులు:

 1. తెలుగు వెలుగు (Best Feature)
 2. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ (మెగా సీరియల్)
 3. చిన్నారి (డైలీ సీరియల్)
 4. పిల్లల చిత్రాల విభాగం ఏవీ అర్హత సంపాదించలేదు
 5. మహాకవి శ్రీశ్రీ (డాక్యుమెంటరి)
 6. కచ్రా (సామాజిక స్పృహ కలిగిన చిత్రం)
 7. వేద గణితం (Educational film)

ఇతర అవార్డులు:

 1. P. ఉదయభాస్కర్ – ఉత్తమ దర్శకుడు (మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ)
 2. మీనా – ఉత్తమ నటి (మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ)
 3. మనోజ్ – ఉత్తమ సహాయ నటుడు (రాధా మధు)
 4. లహరి – ఉత్తమ సహాయ నటి (రాధా మధు)
 5. చలపతి రాజు – ఉత్తమ హాస్యనటుడు (ఋణానందలహరి)
 6. మధు మణి – ఉత్తమ హాస్య నటి (యువ)
 7. రంగనాథ్ – ఉత్తమ ప్రతినాయకుడు (శృతి)
 8. అభిషేక్ రామ – ఉత్తమ బాల నటుడు (కచ్రా)
 9. గాయత్రి – ఉత్తమ బాలనటి (గంటల బండి)
 10. మీర్ హుస్సేన్ – ఉత్తమ మొదటి చిత్రం దర్శకుడు – (చి.లాక్స్.సౌ. స్రవంత)
 11. P. చంద్రశేఖర్ అజాద్ – ఉత్తమ స్క్రీన్ ప్లే (రాధా మధు)
 12. ఆకెళ్ల సూర్యనారాయణ – ఉత్తమ కథా రచయత (నీలో సగం)
 13. CS రావు – ఉత్తమ మాటల రచయత  (విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు)
 14. అనంత్ శ్రీరాం – ఉత్తమ గీత రచయత  (తూర్పు వెళ్ళే రైలు- ”మొన్న ఎదురు చూసా.. ”)

References:

 1. TV9
 2. http://www.hindu.com/2010/03/03/stories/2010030356150200.htm

లీడర్ audio release పూర్తి అయిన రెండు రోజులకు అంటే 24 నవంబరు 2009 రోజు TV9 లో ప్రసారమైన  శేఖర్, రానా ల ఇంటర్ వ్యూల video ఇక్కడ చూడొచ్చు (ఇంటర్ వ్యూ నిడివి 1o:35 ఐతే ఇది పూర్తి ఇంటర్ వ్యూ కాదు) :

22 నవంబరు 2009 సాయంత్రం “మా “TV లో లీడర్ audio విడుదల సందర్భంగా ప్రసారమైన శేఖర్ కమ్ముల ప్రసంగం.  ఆ ప్రసంగం video ఇక్కడ చూడొచ్చు:

(aspect ratio correct చేయబడింది)

బాపు గారి సినీప్రస్థానం project కి ప్రేరణ గుమ్మడి గారే. అవును.

2004లో అనుకుంటా గుమ్మడి గారి “తీపి గురుతులు చేదు జ్ఞాపకాలు” పుస్తకం విశాలాంధ్రలో తీసుకుని చదివాను. ఆ పుస్తకంలో 67-68 పేజీల్లో వారు బాపు రమణల గురించి వ్రాసిన వాక్యాలు నన్ను ఆకర్షించాయి. 68పేజిలో “…. షూటింగ్ స్క్రిప్టులు యథాతథంగా అచ్చు వేయిస్తే అవి వర్థమాన దర్శకులకు బాలశిక్షలా ఉపయోగపడుతుందని నా అభిప్రాయం.” అని చదివి అవి ఎవరైనా ప్రచురిస్తే ఎంత బాగుంటుందో అని ఆశపడ్డాను. తర్వాత “స్మైల్” పత్రికలో ప్రచురించిన “శ్రీనాథ కవిసార్వభౌమ” సినిమా script కోసం బాపు గారు వేసుకున్న story board బొమ్మ ఒకటి చూసిన నాకు ఆ స్క్రిప్ట్లులు చూడాలన్న కోరిక మరింత బలపడింది. కొన్నాళ్ళకు ఆ పని మనమే ఎందుకు చేయకూడదు ఎవరో చేస్తారని ఎందుకు అనుకోవాలని నా మిత్రులతో చెప్పాను. వారికి నచ్చింది. మేము నలుగురము తలా ఇరవై వేలు వేసుకొని మొదలు పెట్టాము. అలా 2005లో మొదలైంది మా project. ఐతే చాలా రోజుల వరకు గుమ్మడి గారిని కలవలేకపోయాము.

బాపు గారి సుందరకాండ షూటింగ్ జరుగుతున్న రోజుల్లో గుమ్మడి గారిని కలిసాను. ఫోనులో అప్పాయింట్మెంట్ తీసుకొని ఒక ఆదివారం (7 అక్టోబరు 2007) ఉదయం వెళ్ళి కలిసాను. బాపు గారితో వారు కొన్ని సిన్మాలు చేసివున్నందున ఆ విశేషాలు చెబితే మేము చేసే project కోసం record చేసుకుంటాను అని వారికి చెప్పాను. ఆరోగ్యం అంత బాగా లేదు కాబట్టి ఎక్కువ చెప్పలేను అన్నారు. ఎంత చెప్పినా చాలు అని చిరునామా “తీపి గురుతులు చేదు జ్ఞాపకాలు” పుస్తకంలో వున్నదేనా అని confirm చేసుకొని వెళ్ళాను. దాదాపు 40 నిమిషాలు వారితో గడిపాను. తర్వాత వారు అలిసిపోయారు. పడుకోవాలని అన్నారు. ఇంకా ఏమి చేప్పేది లేదు, ఎక్కువ మాట్లాడలేను అని అన్నారు. వారి ఇబ్బంది గమనించి recording ముగించి ధన్యవాదాలు చెప్పుకున్నాను. నా దగ్గర వున్న”తీపి గురుతులు చేదు జ్ఞాపకాలు” పుస్తకంపైన వారి autograph తీసుకున్నాను. గుమ్మడి గారు పుస్తకంలో (పేజి 68) పేర్కొన్న బొమ్మ హాల్లో గోడకు వేళ్ళాడుతూ  కనిపించింది (ఇదే బొమ్మా పుస్తకంలో 172 పేజిలో వున్న ఫోటోలో చూడొచ్చు). వారి అనుమతి తీసుకొని ఆ చిత్రం photo మరియు వీడియో తీసుకున్నాను.

ఇన్నాళ్ళకు వారి మరణ వార్త చదివిన నాకు నిజంగా బాధేసింది. ఐతే వారితో గడిపిన 40 నిమిషాలు నాకు తీపి గురుతులుగా మిగిలాయి. వారి వీడియో, వారింట్లో వున్న బాపు గారి బొమ్మ ఇక్కడ చూడొచ్చు.

తర్వాత పేజీ »