cartoon


బాపు గారి కార్టూను రచన

బాపు గారి కార్టూను రచన

నిన్న చెన్నై వెళ్ళి ఈ రోజే వచ్చాను.  చెన్నైలో బాపు గారి కార్టూన్ రచనా ప్రక్రియను ఈ ఫోటోలలో చూడొచ్చు. బాపుగారి అనుమతితో flash లేకుండా తీసినవి. పూర్తి అయిన కార్టూన్లను త్వరలో స్వాతి వార పత్రికలో చూడొచ్చు.

Pupa నుంచి Butterfly

Pupa నుంచి Butterfly

కుంచెతో శిల్పం

కుంచెతో శిల్పం

Other-1962-09-05-p52-andPba-jayadEv-cartoon
ఎన్నో అంతర్జాతీయ కార్టూన్ పోటీల్లో బహుమతులు గెలుచుకున్న మన ప్రసిద్ద తెలుగు కార్టూనిస్టు శ్రీ జయదేవ్ బాబు గారి కార్టూన్ ఇది.  వారు తొలినాళ్ళలో వేసిన కార్టూన్లు కొన్ని scan చేసాను. ఇది  సెప్టెంబర్ 5, 1962 ఆంధ్రప్రభ వారపత్రికలో అచ్చయిన కార్టూన్.

1960-01-06-p10-andptk-cartoon

బాపు గార సినీప్రస్థానం”  project కోసం material collection మొదలుపెట్టి 3 ఏళ్ళు కావస్తోంది. ఎందరో బాపు అభిమానులను కలిసాము. వాళ్ళని బ్రతిమాలి, వాళ్ళ నమ్మకం చూరగొని  వాళ్ళు అభిమానంతో దాచుకున్న ఎన్నో   పాత పత్రికలు (బాపు గారి బొమ్మలు అచ్చు అయినవి) అరువుగా తెచ్చాము. వాటలో ఉపయోగపడే పేజీలన్నీ కాపీ చేసుకొని తిరిగి ఇవ్వడం జరిగింది. అలా చేయటానికి నెలలు, సంవత్సరాలు పట్టింది. అవి కాపీ చేస్తున్న సమయంలో కొన్ని  అసక్తికరమైన ప్రాజెక్టేతర (మా projectకి సంబధం లేనివి) బొమ్మలు, వ్యాసాలు, కథలు. వాటిలో కొన్నిటిని scan చేసాను. వీలైనపుడల్లా అవి ఇక్కడ పంచుకుంటాను. ఈ టపాలో చూస్తున్నది జనవరి 6, 1960 ఆంధ్రపత్రిక (10వ పేజీ) లో ప్రచురింపబడ్డ కార్టూన్.

« గత పేజీ