Ad


Amores Perros, Babel, 21 Grams మరియు ఈసారి Cannesలో ప్రదర్శింపబడ్డ Biutiful సినిమా దర్శకుడు Alejandro González Iñárritu ఇటీవల చేసిన Nike Ad ఇది. తప్పక చూడవలసినది.

Commercials (అడ్వటైజ్ మెంట్లు) కు దర్శకత్వం వహించే Bruno Aveillan ఒక మాంత్రికుడు, ఒక జీనియస్. ఫ్రెంచి దేశస్తుడైన ఈతని Ads అన్నీ దృశ్యపరంగా అద్భుతాలు. కెమెరా, lensలను creativeగా ఎన్ని రకాలుగా వాడొచ్చో ఆ Ads చూస్తే తెలుస్తుంది. Lens transparency (పారదర్శకత)ని మార్చడానికి vase line వంటి పదార్థాలు వాడుతాడంట! France telecom company Orangeవారు Martin Scorsese, Wong Karwai లతో పాటు ఈయన చేత కూడా Ads చేయించుకున్నారు.

ఆయన చేసిన Ads  కొన్ని:

1. Gaz de France అను gas company కి చేసిన Ad (youtube link). దీనికి Imagina 2003 award వచ్చింది.

2. Orangeకి చేసిన Ad (youtube link)

3. Leather bags company “Louis Vitton”కి చేసిన Ad (youtube link) (చాలా బాగుంటుంది)

4. Nintendo కి రష్యా supermodel Inna Zobova తో చేసిన Ad (youtube link)

Louis Vitton Adలోని కొన్ని దృశ్యాలు:

1964-03-11-p41-andPba-EyeTex-Ad 1990-03-16-p44-andJty-eyetex-Ad

ఒకప్పుడు ఐటెక్స్ ప్రకటన అంటే భానుప్రియ కళ్ళు గుర్తుతెచ్చేంత ప్రాచుర్యం పొందింది. 1964, 1990 ల్లో ఐటెక్స్ ప్రకటనలు ఇలా వుండేవి.

1972-11-08-p112-andPba-kulagowravaM-Ad

ఆంధ్రప్రభ వారపత్రిక నవంబరు 8, 1972 సంచికలో 112వ పేజీలో ప్రచురింపబడ్డ కులగౌరవం సినిమా పోస్టర్.

1961-11-10-p63-andPtk-yuva-Ad

యువ మాస పత్రిక స్థాపించింది చక్రపాణి గారని చాలా మందికి తెలిసేవుంటుంది. అప్పట్లో ఆ పత్రిక విజయవంతంగా నడిచింది. 1934-35లో తెనాలిలో మొదలైన ఈ పత్రిక 1960లో హైదరాబాదుకు చేరింది. పైన చూస్తున్న బొమ్మ ఆంధ్రపత్రిక 1961 నవంబరు 10 సంచికలో 63వ పేజీలో వచ్చిన యువ దీపావళి సంచిక ప్రకటన. ప్రకటనలో కోడిపుంజు లోగో(logo)తోపాటు “పబ్లిక్ గార్డెన్స్, హైదరాబాదు” అన్న చిరునామా చూడొచ్చు. అంతే కాకుండా ప్రకటనలో వున్న సరస్వతి బొమ్మ 1942లో వచ్చిన నాగయ్యగారి భక్త పోతన లో మనకు కనిపించే సరస్వతిలాగా అనిపిస్తుంది.

nagayyaPotana

భక్త పోతనలో ఒక సన్నివేశం

తర్వాత పేజీ »