స్వంత గోడు


anwar-chandra-garluS

దసరా పండగకని 27 అక్టోబరు హైదరాబాదు వెళ్ళాను. ఉదయం 8 గంటలకల్లా ఇంట్లో వున్నా. మధ్యాహ్నం ఒంటగంట ప్రాంతాన చంద్రగారినుంచి ఫోనొచ్చింది. “అన్నా! నేను అన్వర్ ఇంట్లో వున్నా. అన్వర్, నేను కలిసి మీ ఇంటికి వచ్చి  నిన్ను కలుస్తాము.” అన్నారు. మా అమ్మానాన్నలుండేది సంస్కృతి టౌన్షిప్ అని ఘట్కేసర్ దగ్గర. అన్వర్ గారుండేది మెహిదీపట్నం దగ్గర. అంత ఇబ్బంది ఎందుకు నేనే వస్తాను సార్ అన్నాను. లేదు లేదు మేమే వస్తాం అన్నారు చంద్ర. మంచి chance అని తప్పక రండి అని address చెప్పాను. దాదాపు మూడు గంటల ప్రాంతాన చంద్ర అబ్బాయి కారులో ఇంటికొచ్చారు. అప్పటికే చంద్రగారు ఆకలితో వున్నారు. పది నిమిషాల్లో భోజనం సిద్దం చేసింది మా అమ్మ. చాలా ఇష్టంగా భోంచేసారు చంద్రగారు. అన్వర్ గారు ఆలస్యంగా టిఫిన్ చేసారని తక్కువే తిన్నారు.

నాలుగు గంటల వరకు సినిమాలు, పిచ్చాపాటి మాట్లాడుకున్నాం. పైన వున్నఫోటో మా ఇంట్లో తీసిందే (అన్వర్ గారు(ఎడమ), నేను(మధ్య), చంద్రగారు(కుడి)).  నాకు ఇష్టమైన ఇద్దరు కళాకారులు మా ఇంటికి అతిథులుగా రావటం నాకు దసరా కానుకే మరి.

చిన్నపుడు మేము “సారు” టప టపా కొట్టాడు అనుకునేవాళ్ళము. అందుకే ఈ “టపా” అను పదం నాకు కొంచం funnyగా అనిపిస్తుంది. ఏమైనా ఇది నా మొదటి post (టపా 🙂 ). ఈ siteని జనవరి 4 నే register చేసుకున్నపట్టికీ ఇప్పటిదాకా (అంటే మే 1 దకా) వ్రాయటానికి సాహసించలేదు.

నా పేరు విజయ్. బెంగుళూరులో ఉద్యోగం. ఇక్కడ (అంటే ఈ బ్లాగులో) నేను చూసిన/చూస్తున్న చిత్రాలు, విచిత్రాల గురించి వ్రాసుకుంటాను. Similar interests (దీన్ని తెలుగులో ఎలా వ్రాయాలో తెలీలేదు)  వున్న వాళ్ళతో పరిచయం అవుతుందని, వారినుంచి ఇంకా నేర్చుకునే అవకాశం లభిస్తుందని ఆశిస్తున్నాను.