రచయతలు


బొమ్మ: జయదేవ్ దంపతులు, శ్రీ రాంపా, కార్టూనిస్టుల పిల్లలు (కుందేలు ఆకారంలో వున్న కేకు!)

డిసెంబరు 20వ తేది (ఆదివారం) జలవిహార్ లో “గ్లాచ్చు మీచ్యూ” పుస్తకావిష్కరణ, జయదేవ్ గారి 70వ జన్మదిన వేడుక కార్టూనిస్టులు, ఆర్టిస్టుల మధ్య  జరిగాయి. ఆ సంబరాలలో పాలుపంచుకోవాలని నేను హైదరాబాదు వెళ్ళాను. అక్కడ ఆర్టిస్టులందరినీ ఒక్కసారి చూసే భాగ్యం కలిగింది. ఆ వేడుకల video ఇక్కడ చూడొచ్చు (video 7 ఎందుకో పనిచేయట్లేదు).

మొదట జయదేవ్ గారి 70వ జన్మదిన వేడుక రాంపా గారి ఆధ్వర్యంలో సరదాగా సా…గింది. తర్వాత పుస్తకావిష్కరణ అయ్యింది. తర్వాత జయదేవ్ గారు వారి సందేశాన్ని అందించారు (పై లింకులో video 8). మధ్యాహ్నం మూడుగంటలకు మొదలైన ఈ కార్యక్రమం ఏడు గంటలవరకు సాగిందంట.  నా రైలు ఏడు గంటలకే కాబట్టి ఐదున్నర వరకే  (జయదేవ్ గారి సందేశం పూర్తి అయ్యేవరకు) వుండగలిగాను.


పాఠకుల అభిమానాన్ని చూరగొన్న శ్రీ ముళ్లపూడి వెంకటరమణ గారి కోతికొమ్మచ్చి ఇప్పుడు శ్రవణ పుస్తకంగా వచ్చేస్తోంది. ఈ పుస్తకాన్ని స్వరపరిచింది మరెవరో కాదు బాపు రమణల చిరకాల మిత్రుడు, తెలుగు వారి అభిమాన గాయకుడు శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు. ప్రస్తుతం ఐదు అధ్యాయాలు అందుబాట్లో వున్నాయి. బహుశా తెలుగు సాహిత్య చరిత్రలో ఇదే మొదటి శ్రవణ పుస్తకం అయ్యుండొచ్చు. ఈ అపూర్వమైన నిధిని మీ సొంతం చేసుకోవాలనుకుంటే  http://www.kothikommachi.com/ ను సందర్శించండి (కొన్ని samples ఉచితంగా వినవచ్చు!).

బాపు గారి ఛాయా చిత్రాలు సేకరిస్తున్న సందర్భంలో తారసపడ్డ ఒక అరుదైన ఛాయాచిత్రం. ఈ చిత్రంలో వున్నవారిని గుర్తుపట్టగలరా? గుర్తుపట్టలేకపోతే వచ్చే వారం ఈ టపా మళ్ళీ చూడండి.

అవును కార్టూనిస్ట్ జయదేవ్ గారు, మన జయదేవ్ గారు వ్రాసుకున్న స్వగతం (దాదాపు 120 personal stories) “గ్లాచ్చు మీచ్యూ – నా పర్సనల్ స్టోరీలు” అను పుస్తకంగా త్వరలో విడుదల కాబోతున్నది. ఈ పుస్తకానికి ముఖచిత్రం, అట్ట డిజైను చేసింది శ్రీ అన్వర్. ముందుమాట వ్రాసింది శ్రీమతి మాలతీ చందూర్. ఈ పుస్తకాన్ని ప్రచురించింది జయదేవ్ గారి చిరకాల మిత్రులు ఒకప్పటి మా బడి పత్రికతో తెలుగు విద్యావిధానంలో మార్పు తెచ్చిన చౌడెపల్లె ప్రచురణకర్తలు (విజయవాణి ప్రింటర్స్) : VNR Book World వారు.

ఇక పుస్తకంలోని రెండు పేజీలు ఈ క్రింది బొమ్మలో చూడండి.

చదివారు కదా. బాగున్నాయి కదా కథలు. ఆలస్యమెందుకు మీకోసం  కాపీలు రిజర్వుచేసుకోవడానికి పై బొమ్మలో వున్న చిరునామాను సంప్రదించండి.

Ruskin Bonf

Ruskin Bond

ఈ రోజు Deccan Herald దినపత్రిక ఆదివారం అనుబంధంలో ప్రసిద్ధ ఆంగ్ల రచయత Ruskin Bond article వచ్చింది. ఆయనకు 75వ ఏళ్ళు నిండిన సందర్భంగా ప్రచురించారు. దాంట్లో కొన్ని పేరాలు నన్ను ఆకట్టుకున్నాయి:

Happiness is as elusive as a butterfly, and you must never pursue it. If you stay still, it might come and settle on your hand. But only briefly. Savour those precious moments, for they will not come your way often.

ఇంకోటి:

Don’t believe the elders and philosophers, wisdom does not come with age. It is born with you in cradle.  Either you have it or you don’t. For the most part I have followed instinct rather than intelligence, and this has resulted in a modicum of happiness.