పుస్తకం


ప్రపంచ మేటి సినిమా దర్శకులను సైతం మెప్పించిన సినిమాలు ఏమిటో తెలుసుకోవాలనే కుతూహలం నాకు వుంది.  వారి ఇంటర్వ్యూల్లో ఈ ప్రశ్న వుందోనని వెతుకుతాను.  అదే ప్రశ్నను వివిధ దర్శకులను అడిగి తెలుసుకుంటే బాగుంటుందనే ఆలోచనతో Geoffrey Macnab మరియు British Film Institute వాళ్ళు ఒక పుస్తకం అందించబోతున్నారు. ఆ పుస్తకమే: Screen Epiphanies: Filmmakers on the Films that Inspired Them

ఈ పుస్తకంలో మనకు తారసపడే దర్శకులలో కొందరు:

 • Danny Boyle, Apocalypse Now
 • Gurinder Chadha, Purab Aur Pachhim
 • Mike Leigh, Room at the Top
 • Alan Parker, Little Fugitive
 • David Puttnam, Pinocchio
 • Lars Von Trier, Barry Lyndon
 • Atom Egoyan, Persona
 • Ken Loach, The Fireman’s Ball
 • Abbas Kiarostami, Eight and a Half
 • Aki Kaurismäki, Nanook of the North
 • Mira Nair, La Jetée
 • Martin Scorsese, The Red Shoes

జనవరి 19న విడుదల కాబోతున్న ఈ పుస్తకం Amazon.com లో pre-order చేసుకోవచ్చు.

బొమ్మ: జయదేవ్ దంపతులు, శ్రీ రాంపా, కార్టూనిస్టుల పిల్లలు (కుందేలు ఆకారంలో వున్న కేకు!)

డిసెంబరు 20వ తేది (ఆదివారం) జలవిహార్ లో “గ్లాచ్చు మీచ్యూ” పుస్తకావిష్కరణ, జయదేవ్ గారి 70వ జన్మదిన వేడుక కార్టూనిస్టులు, ఆర్టిస్టుల మధ్య  జరిగాయి. ఆ సంబరాలలో పాలుపంచుకోవాలని నేను హైదరాబాదు వెళ్ళాను. అక్కడ ఆర్టిస్టులందరినీ ఒక్కసారి చూసే భాగ్యం కలిగింది. ఆ వేడుకల video ఇక్కడ చూడొచ్చు (video 7 ఎందుకో పనిచేయట్లేదు).

మొదట జయదేవ్ గారి 70వ జన్మదిన వేడుక రాంపా గారి ఆధ్వర్యంలో సరదాగా సా…గింది. తర్వాత పుస్తకావిష్కరణ అయ్యింది. తర్వాత జయదేవ్ గారు వారి సందేశాన్ని అందించారు (పై లింకులో video 8). మధ్యాహ్నం మూడుగంటలకు మొదలైన ఈ కార్యక్రమం ఏడు గంటలవరకు సాగిందంట.  నా రైలు ఏడు గంటలకే కాబట్టి ఐదున్నర వరకే  (జయదేవ్ గారి సందేశం పూర్తి అయ్యేవరకు) వుండగలిగాను.

బెంగుళూరులో నాకు ఇష్టమైన రెండు పుస్తకాల దుకాణాలు: Strand Book Stall మరియు Blossoms. ఆ Strand Book Stall వాళ్ళు ప్రతి సంవత్సరం బెంగుళూరులో book festival నిర్వహిస్తారు. ఈ సంవత్సరం “బసవ భవన్”(Planetorium దగ్గ్రర)లో నిర్వహిస్తున్నారు. ఈ ఆదివారం ఆ పుస్తక ప్రదర్శకు వెళ్ళాను. అక్కడ Strand Book Stall, బెంగుళూరు అధినేత విద్యా వీర్కర్ ని ఇంటర్వ్యూ చేసాను (Thanks to Ms. Vidya Virkar for sparing her time.). ఆ ఇంటర్వ్యూ వీడియో ఇక్కడ చూడొచ్చు:

మొదటి భాగం

రెండవ (చివరి) భాగం

ఈ పుస్తక ప్రదర్శన ఇంకా 13 డిసెంబరు దాకా వుంటుంది. ఈ పుస్తక ప్రదర్శన యొక్క ఆసక్తికరమైన అంశం ఏమిటంటే: “Fresh stocks every single day”.