ఆంధ్రపత్రిక


1962-10-19-p31-andPtk-jayadev-cartoon

19 అక్టోబరు1962 ఆంధ్రపత్రిక సంచిక 31వ పేజీలో ప్రచురింపబడ్డ జయదేవ్ గారి కార్టూన్.

1961-11-10-p63-andPtk-yuva-Ad

యువ మాస పత్రిక స్థాపించింది చక్రపాణి గారని చాలా మందికి తెలిసేవుంటుంది. అప్పట్లో ఆ పత్రిక విజయవంతంగా నడిచింది. 1934-35లో తెనాలిలో మొదలైన ఈ పత్రిక 1960లో హైదరాబాదుకు చేరింది. పైన చూస్తున్న బొమ్మ ఆంధ్రపత్రిక 1961 నవంబరు 10 సంచికలో 63వ పేజీలో వచ్చిన యువ దీపావళి సంచిక ప్రకటన. ప్రకటనలో కోడిపుంజు లోగో(logo)తోపాటు “పబ్లిక్ గార్డెన్స్, హైదరాబాదు” అన్న చిరునామా చూడొచ్చు. అంతే కాకుండా ప్రకటనలో వున్న సరస్వతి బొమ్మ 1942లో వచ్చిన నాగయ్యగారి భక్త పోతన లో మనకు కనిపించే సరస్వతిలాగా అనిపిస్తుంది.

nagayyaPotana

భక్త పోతనలో ఒక సన్నివేశం

1962-10-12-p35-andPtk-jayadev-cartoon

ఈరోజు జయదేవ్ గారి 70వ పుట్టినరోజు (ఇందాకే అన్వర్ గారు గుర్తుచేసారు). జయదేవ్ గారు ఎందరో ఔత్సాహిక కళాకారులకు స్ఫూర్తిదాతలు, గురుతుల్యులు. వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. పైన చూస్తున్నది ఆంధ్రపత్రిక 1962 అక్టోబరు 12  సంచికలో 35వ పేజీలో ప్రచురింపబడ్డ జయదేవ్ గారి కార్టూను.

1961-10-25-p31-andPtk-shrIshrI-poem

ఆంధ్రపత్రిక 1961 అక్టోబరు 25 సంచికలో ప్రచురింపబడ్డ ఒక కవిత. ఆ శీర్షిక టైటిల్ డజైను బాపుగారిదే.

1959-02-11-p58-andptk-rameshnayudu-edit

కొత్తగాయకులను పరిచయం చేయడానికి జరిగిన పోటీలో ఎన్నికై విశ్వరూపా వారి “కూతురు కాపురం” చిత్రంలో తొలిపాట పాడుతున్న గాయని ఉమ, పోటీ నిర్వహించి ఆమెకు తొలి అవకాశమిచ్చిన సంగీత దర్శకుడు రమష్ నాయుడు. ఫిబ్రవరి 11, 1959 ఆంధ్రపత్రిక 58వ పేజీలో ప్రచురింపబడ్డ ఫోటో.

తర్వాత పేజీ »