ఇన్నాళ్ళు, steadicam వాడిన మొదటి సినిమా 1989లో వచ్చిన రాంగోపాల్ వర్మ “శివ” అనుకుంటూవచ్చాను. ఈ రోజు (మే 2) ఆంధ్రజ్యోతి నవ్యలో ప్రచురింపబడ్డ ఇంటర్వ్యూలో దాసరి గారు సినిమా టెక్నిక్ గురించి మాట్లాడుతూ steadicamను మేఘసందేశంలో వాడానని చెప్పారు. “మేఘసందేశం సినిమాను స్టడీ కెమెరాతో తీశాను. ట్రాలీ, క్రేన్, జూమ్ ఇవేమి వాడలేదు. దీనిని ఇక్కడ ప్రేక్షకులు, మీడియా గుర్తించలేదు. మాస్కో ఫిలిం ఫెస్టివల్‌కు వెళ్లినప్పుడు- అక్కడ ఒకరు ఈ విషయం మీద రివ్యూ రాశారు. టెక్నిక్ అనేది రూపాన్ని మార్చేయకూడదు.”
Reference:
మే 2, 2010 at 15:15
అవునన్దీ అందువల్లనే కాబోలు ఆ సినీమా టేకింగ్ లో ఏదో డిఫరెన్స్ కనబడుతుంది…
మే 2, 2010 at 23:51
మీరు పొరబడ్డారు. మేఘసందేశం సినిమాని కేవలం ‘స్టడీ కెమేరా’తో తీశాను అని దాసరి చెప్పాడు – steadicam తో కాదు. పానింగ్ షాట్స్, ట్రాకింగ్ షాట్స్ వగైరా లేకుండా కెమెరా ఓచోట స్థిరంగా పాతేసి (జూమింగ్ సైతం లేకుండా) తీసిన షాట్స్ తోనే ఆ సినిమా మొత్తం నిండి ఉంటుంది – మీరు గమనించారో లేదో. అటువంటివి తీయటానికి పెద్దగా టెక్నిక్‌తో పనుండదు. అయినా అప్పట్లో ప్రేక్షకులు ఆ తేడా గమనించకుండా కథలో లీనమైపోయి సినిమా చూసి హిట్ చేశారని దాసరి ఉద్దేశం.
Btw, Dasari has never been a technical savvy director and, although steadicam was invented in 1976, it didn’t attain popularity until Stanly Kubrick’s ‘The Shining’ in 1980. I don’t think somebody like Dasari would introduce it to Indian cinema.
మే 3, 2010 at 05:45
థాంక్సండి. ఇంటర్వ్యూలో ‘స్టడీ కెమేరా’ అని చదివాను. ఐనా కొత్త technique గురించి చెబుతున్నారు కాబట్టి steadicam అని అనుకున్నా. ఆ effect ఏంటో చూద్దామని ఈ సినిమా మళ్ళీ చూడాలని ప్రయత్నించా. కాని కుదరలేదు.
మే 3, 2010 at 09:59
Ofcourse, our directors are unnecessarly using zoom,track,trolly etc with cost. Movie camera should not move..
మే 4, 2010 at 22:07
స్టడి క్యామ్ అన్నది స్టడీగా ఉండడం కాదు..అది నిజంగా స్టడి క్యామ్ అంటే షేక్ కాకుండా మూమెంట్ ఉండడం, దాసరి మరి ఏ కాంటెక్స్ట్లో అన్నారో తెలీదు గాని ఆయన మేఘసందేశం తీసే సమయానికి స్టడిక్యామ్ కెమెరా ఇంకా ఇండియాకు రాలేదు, స్టడీగా కెమెరా ఉంచడాన్ని సినిమా గ్రామర్ లో “స్టాటిక్” అని అంటారు. మరి బహుశ దాసరి గారి ఆ గ్రామర్ మరిచిపోయారేమో.
ఆగస్ట్ 20, 2010 at 16:07
anthe anthaku minchi emi undadu.