చాలా మంది ఆర్టిస్టులకు అభిమాన ఆర్టిస్ట్ ఐన Norman Rockwell ఒకసారి ఇండియా వచ్చాడు. 1962లో తమ పత్రిక ముఖచిత్రం కోసం అప్పటి భారతదేశ ప్రధాని జవహర్ లాల్ నెహ్రు portrait వేయవలసిన బాధ్యతను Saturday Evening Post వారు Norman Rockwellకు అప్పగించారు. అప్పటి ఆ పత్రిక ఎడిటర్ Robert Sherrod, తన భార్య Margaret Carsonతో Norman Rockwellను, Norman Rockwell భార్య Mollyని ఇండియా తీసుకొచ్చారు. అప్పుడు Norman Rockwell వేసిన బొమ్మలే ఈ రెండు. నెహ్రు portrait జనవరి 19, 1963 Saturday Evening Post ముఖచిత్రంగా ప్రచురింపబడింది. ఈ రెండు బొమ్మలను Norman Rockwell ఎడిటర్ గారి సతీమణి Margaret Carsonకి బహుమతిగా ఇచ్చారు.
రెండో బొమ్మపైన Norman Rockwell వ్రాసిన మాటలు:
Dear Margaret,
Here’s the head of one of the boys
you and I admired so much
in dear ole India
Norman
అక్టోబర్ 18, 2010 at 09:51
నార్మన్ రాక్వెల్ బొమ్మ చూసి చాలా కాలమయింది.
మా చిన్నతనంలో కంభం సత్రం వీధిలో మా ఇంటి
ప్రక్క లూధరన్ రీడింగ్ రూమ్ వుండేది. అక్కడ మా
నాన్నగారు లైబ్రరీకీ చందాదారవటం వల్ల ప్రతి
వారం Saturday Evening Post వచ్చేది. ఆ పత్రిక
ముఖచిత్రం మీద రాక్వెల్ జీవకళ ఉట్టిపడేట్టు గీసిన
పెయింటింగ్స్ వుండేవి. ఇంత కాలానికి ఆయన గీసిన
బొమ్మను చూపించినందుకు ధన్యవాదాలు.