ఈ రోజు (28 మార్చి 2010) సాక్షి దిన పత్రిక “ఫ్యామిలీ” అనుబంధంలో దర్శక దిగ్గజం మణిరత్నంపైన ఒక వ్యాసం ప్రచురించారు. చాలా స్పూర్తిదాయకంగా వుంది. మొదటి నాలుగు చిత్రాలు flopఐనా ఐదవ సినిమా (మౌనరాగం) తను తీయాలనుకున్న విధంగానే తీసి విజయం సాధించాడు. మౌనరాగం సినిమా “నెంజత్తై కిల్లాదే” అను J. మహేంద్రన్ సిన్మా inspirationతో తీసిందంట (బాపు గారి సీతమ్మ పెళ్లి కూడా J. మహేంద్రన్ గారి “ముల్లుం మలరుం” సినిమా ఆధారంగా తీసిందే). నాకెందుకో ఆ మొదటి నాలుగ్ సినిమాలు ఎందుకు flop అయ్యాయో తెలుసుకోవాలని వుంది. ఆ నాలుగు సినిమాలు:

1. పల్లవి అనుపల్లవి (కన్నడం) (తెలుగు డబ్బింగు VCD మార్కెట్లో వుంది)
2. ఉనరు (మలయాళం) (VCD సంపాదించాను కాని subtitles లేవు)
3. పగల్ నిళవు (తమిళం)
4. ఇదయ కోవిల్ (తమిళం)

ఎవరైనా ఈ సినిమాలు చూసారా? చూసి వుంటే అవి ఎందుకు flop అయ్యాయి అని అనుకుంటున్నారు? మణిరత్నం పేరు సంపాదించిన తర్వాత కూడా అవి ఆ సిన్మా పేర్లు ఎందుకు విరివిగా వినిపించట్లేదో!

Reference:
సాక్షి :

ప్రకటనలు