బెంగాల్ లో “గౌరి” సినిమా (ఈ సినిమా మధ్యలో ఆగిపోయింది) shooting లో  S. గురుస్వామి & గురుదత్ లతో శ్రీ V.K. మూర్తి(hatతో)

VK మూర్తి గారితో http://www.sarai.net వారు 1999 డిసెంబరులో చేసిన ఇంటర్వ్యూలోంచి కొన్ని విశేషాలు ఇవి. ఈ ఇంటర్వ్యూ చాలా రోజుల వరకు క్రింది లంకెలో దొరికేది.
http://www.sarai.net/cinematography/pdf/interviews/vk_murthy.PDF

ఇంకా చాలా cinematographerల ఇంటర్వ్యూలు వుండేవి. అవన్నీ ఇప్పుడు లేవు. అదృష్టవశాత్తు VK మూర్తి గారి ఇంటర్వ్యూ రెండేళ్ళ క్రితం అనుకుంటా print తీసి దాచుకున్నా. ఇందాక (19 మార్చి 2010 సాయంత్రం 6.30కు) దూరదర్శన్ లో VK మూర్తి గార్కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రధానం ప్రత్యక్షప్రసారం చేసారు. అది చూస్తున్నడు ఈ ఇంటర్వ్యూ గుర్తుకొచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ని విశేషాలు:

Assistant గా అనుభవం:

 1. “మహారాణా ప్రతాప్”, “సతి తులసి” మరియు “రేణుక” సినిమాలకు cameraman ద్రోణాచార్య దగ్గర assistant
 2. Cameraman V Ratra దగ్గర
 3. తను బాగా అభిమానించే Fali Mistry దగ్గర చాలా కాలం పని చేసారు.

తనకు స్పూర్తినిచ్చిన సినిమాలు:

 1. Portrait of Dorian Gray
 2. Portrait of Jenny: ఈ సినిమాలో canvas painting shotsలో canvas దారాల texture చాలా స్పష్టంగా చిత్రీకరించిన తీరు.
 3. British B&W సినిమా Great Expectations
 4. Odd Man Out
 5. Hitchcock సినిమాలు

పుస్తకాలు:
Fali Mistry గారి నుంచి అరువు తీసుకుని చదివిన American Cinematographer పత్రికలు. కాని ఎక్కువ technical details వుండేవి కావంట. Location, lighting లాంటి వివరాలు మాత్రమే వుండేవంట. కాని ఆ పత్రికలో వచ్చే stills బాగా నచ్చి అలాంటివి shoot చేయటానికి తన still camera తో ప్రయత్నించేవారంట.

ఆ రోజుల్లో వాడిన పరికరాలు:

 1. Camera: Mitchell, Imoh, Arriflex
 2. Film: Plus X (100 ASA), Double X (250 ASA), Triple X
 3. Filters: 15G, 3N5, 5N5, 72B

మొదటి సినిమా అనుభవం: మూర్తి గారి మొదటి సినిమా పూర్తి కాకుండానే ఆ సినిమా పాకిస్తాన్ పారిపోయాడంట. V Ratra దగ్గర assistant గా “బాజి” సినిమాకు పనిచేస్తున్నపుడు ఒక పాటలో కొంత భాగం వైవిధ్యంగా shoot చేసి దర్శకుడు గురు దత్ నమ్మకాన్ని చూరగొన్నాడు. ప్యాసాలో జాని వాకర్ వేసిన పాత్రకు మూర్తి గారిని అడిగారంట గురుదత్ కాని మూర్తి గారు నిరాకరించారంట. గరుదత్ మూర్తి గారి కోసమే ప్యాసా, కాగజ్ కే పూల్ (మన దేశపు మొదటి స్కోపు చిత్రం) తీసారంట.  “చౌదివి కా చాంద్” చిత్ర విజయం తర్వాత 1960లో గురుదత్ మూర్తి గారిని లండన్ కు Guns of Navarone shootingకి పంపారంట – Eastman color technology గురించి తెలుసుకోవటం కోసం. ఐతే అక్కడి యూనియన్ నిబంధనల వల్ల రెండున్నర నెలల కన్నా ఎక్కువ వుండలేకపోయారు.

Lighting విధానం:

 1. Ground lights filling కోసం వాడి, overhead lights ముఖానికి వాడేవారు. ఇంకా shadow pattern కోసం ఇతర lights.
 2. Color film shooting కోసం makeup తక్కువ వేసుకోమనేవారంట. Lipstick మరీ bright వుండకుండా చూసుకునేవారంట.
 3. గురుదత్ సినిమాల్లో క్లోజప్ shots ఎక్కువగా వుండి ఆ closeup shotsలో movement వుండేది. Close up shootingలో fill light ఇవ్వటం కష్టం ఎందుకంటే ఆ fill light ఇంకో చోట నీడను సృష్టిస్తుంది. ఈ సమస్యను నివారించటానికి  Walter Thomson Co.లో పనిచేస్తున్న తన మిత్రుడి దగ్గర నుంచి clip వున్న ఒక llightను తీసుకుని Mitchel camera sunshadeకు వున్న రెండు rodsకు బిగించి (100W లేదా 200W బల్బుతో) వాడారు. ఐతే constant color temperature అవసరమయ్యే color filmకు ఈ setup ఉపయోగపడదు. దానికోసం ఇంకో light rolling netతో తయారు చేసుకున్నారు.
 4. Framing చేసేటప్పుడు ఆ frameలో విశేషం ఏముందో చూసి దాని ప్రకారం shot compose చేసేవారంట. దర్శకుడి ఏ shot అడిగినా సాధ్యం కాదని అనేవారు కాదంట.
 5. Camera movementలో, shot cut చేసే విధానంలో తన కన్నడ నాటకాల, శాస్త్రీయ సంగీత నేపథ్యం బాగా ఉపయోగపడిందట (మూర్తి గారు వయోలిన్ వాయిస్తారు). బహుశా అందుకేనేమో పాటల్లో camera పనితనం మరింత బాగుండేది. ఈ magic “ప్యాసా”లో “జానె వో కైసె లోగ్ థే” పాటలో closeup shotsలోని camera movementsలో చూడొచ్చు.
 6. హీరోయిన్లు అందంగా కనపడేందుకు మంచి lighting, diffusers వాడేవారంట. అప్పుడప్పుడు రెండు diffuserలు వాడేవారంట. అంతే కాక స్వయంగా Kodak MP diffuser కొన్నారంట. ముఖం lighting కోసం lens పైన కూడా diffusion పెట్టేవారంట. దీని కోసం 1975లో Parisలో transparent Nylon kerchiefలు కొన్నారంట.
 7. ప్యాసాలో వహీదా రహమాన్ మొదటిసారిగా కనిపించే సీన్లో కనిపించేది నిజం చందమామే.
 8. India లో light conditionsకి Europe లో ని light conditions చాలా తేడా వుంది. అక్కడి light చాలా softగా వుంటుంది. అందుకే Europeలో shooting చేసేటప్పుడు diffusers వాడేవారు కాదంట.
 9. “కాగజ్ కె ఫూల్” లో ఆ సూర్య రశ్మి shot సూర్య రశ్మిని రెండు అద్దాలతో (ఒక్కొక్కటి 4 అడుగుల ఎత్తు) reflect చేసి తీసారు. ఒక అద్దం కాంతి బయటినుంచి reflect చేస్తే, రెండో అద్దం ceilingలో వుండి studioలోకి reflect చేసారంట.  ఈ shot ఒక్క గంటలో పూర్తి చేసారంట. లేకపోతే పదే పదే అద్దాలను adjust చేయాల్సివచ్చేది.
 10. Color film shooting కోసం సరైన lights దొరికేవి కాదంట. ఏ light 3000K కన్నా ఎక్కువ ఇచ్చేది కాదంట. అప్పుడు still photographyలో వాడే Nitro-Flood lights వాడారంట. అవి 5000K light  ఇచ్చేవంట. “చౌదివి కా చాంద్” లో ఈ technicనే వాడారంట.
 11. భారత్ ఏక్ ఖోజ్ కోసం లైబ్రరీల్లో పాత paintings, photographs study చేసారంట.
 12. “తమస్” సీరియల్ కి పనిచేయటం సంతృప్తినిచ్చిందంట.  ఆ “స్త్రీలి బావిలో దూకే” సీను కోసం 10 అడుగుల గొయ్యి తవ్వారంట. ముందు top angle shots చేసారంట. తర్వాత దర్శకుడు గోవింద్ నిహలాని సలహా ప్రకారం low angle shots తీసారంట.
 13. తమస్ కోసం parabloc reflector చేసుకున్నారంట. చిత్రం ఏంటంటే రెండు నెలల తర్వాత American Cinematographerలో కొత్త design అని parabolic reflector గురించి వేరే ఎవరో వ్రాసారంట.
 14. B&Wలో Day for night సరిగ్గా చేసే అవకాశం రాలేదంట. ఐతే ఆ effect కోసం N5 (green filter)తో పాటు 23A filter వాడాలంట.
ప్రకటనలు