నాకు ఇష్టమైన దర్శకుడు శేఖర్ కమ్ముల సినిమా అని వెంటనే చూద్దామని ఈరోజు (21 Feb 2010) వెళ్ళాను. సినిమాలపైన సమీక్ష వ్రాసే స్థోమత, అనుభవం లేదు. కాని నాకు ఇష్టమైన దర్శకుడి సినిమాపైనె నేను వ్రాసుకున్న నా observations కొన్ని (spoilers వున్నాయి) ఇవి:

నాకు నచ్చినవి.

 1. రాజేశ్వరి (సుహాసిని – హీరో తల్లి) చినిపోయే ముందు రాత్రి రానాతో చెప్పే మాటలు. ఆ సన్నివేశంలో సుహాసిని ఆ mood తగ్గట్టుగా పుస్తకం పై వేళ్ళు tap చేయటం బాగా నప్పింది. ఆ సన్నివేశంలో ఆమె చదివే పుస్తకం “Mohandas” కూడా  బాగా సరిపోయింది.
 2. సుహాసిని చనిపోయినపుడు నిజంగా బాధేసింది. (ఆమె చనిపోయినపుడు లక్షమంది ఆడవాళ్ళు రావటం ముళ్లపూడి రమణ గారి అమ్మ్గగారు చనిపోయినపుడు కొన్ని వేల మంది ఆడవాళ్ళు రావటం గురించి “కోతికొమ్మచ్చి”లో వ్రాసిన ఘట్టం  గుర్తుకుతెచ్చింది)
 3. Police Academy మొదలుపెట్టమని హోం మంత్రితో చెప్తూ 10% కావాలా… 20% తోసుకోండి అన్న సన్నివేశం బాగుంది. హీరో నిస్సహాయత,  రాజకీయ దరిద్రం అన్నీ కనిపిస్తాయి.
 4. డైలాగులు బాగున్నాయి. ముసలాయన (చంపబడ్డ అమ్మాయి తాలూకు) రానా మాట్లాడే సన్నివేశం ఒక మంచి ఉదాహరణ. “నిజాయితిగా వుండటం త్యాగం అనుకుంటారు” లాంటివి చాలా వున్నాయి.
 5. చాలా రోజులకు కోట routineగా కాక differentగా కనిపించారు.

హీరో గురించి:

 1. నడకలో ఛాతి వెడల్పు చేసి నడవటం (gym ఎక్కువ చేసేవారి లాగా) బాలేదు. కొంచెం తగ్గిస్తే బాగుండేది. అది తప్ప body language బాగుంది. ఐతే కరుణరసం పండించే సన్నివేశాలలో అతను తన  నటన మెరుగుపరుచుకోవాలి.
 2. హీరో పొగ త్రాగటం బాలేదు. Smoking బదులు gum నమిలినట్టు చూపితే బాగా వుండేది.
 3. రానా స్వరం బాగుంది. ఆయనకు మంచి strength అది.

కొన్ని Technical ఇబ్బందులు

 1. సినిమా మొదట్లో, రాజశేఖరా పాటలో, సిన్మా చివరలో అప్పుడప్పుడు lip synch లేక ఇబ్బందిగా అనిపించింది.
 2. అసెంబ్లీ ముందు వున్న గాంధి విగ్రహం video quality బాలేదు
 3. చివర్లో బొగ్గు గనుల సన్నివేశం, ఓరుగల్లు కోట video, చివరి ప్రమాణ స్వీకారం video quality (Video Effects) అస్సలు బాలేదు. AVM వంటి పెద్ద producerలు కూడా quality దగ్గర comprimise అవటం బాలేదు.
 4. డబ్బు దొరికిందని రానా phone చేయగానే ఆలి (హర్షవర్థన్) “సార్” అన్నపుడు సా అని ఆలాపన వస్తుంది. ఎందుకో అది సరిపోయినట్లు అనిపించలేదు. ఆ music సాతో మొదలవ్వక “ఆ… ” అని వుంటే బాగుండేదేమో
 5. సినిమా మొదట్లో CM అవమని సుహాసిని రానాకు చెబుతున్నపుడు camera focus సరిగా లేదనిపించింది.
 6. Assembly hall చాలా చిన్నగా అనిపించింది. Budget పరంగా పెద్దగా set వేయలేకపోయినా camera work లో cover చేసి వుండాల్సింది (Depth of field తగ్గిస్తే బాగుండేదేమో)


ఇక నాకు నచ్చని అంశాలు (కొంచెం ఎక్కువే):

 1. రత్న ప్రభ (ప్రియా ఆనంద్) పాత్ర అవసరంలేదు. ఆ పాత్ర చాలా sillyగా వుంది. ఆ పాత్ర లేకుండానే కథ నడపవచ్చు. రత్న ప్రభ తల్లి సన్నివేశం శుద్ద అనవసరం.
 2. రత్నప్రభ “నువ్వు కూడా CM అవటానికి గడ్డి తింటున్నావు కదా” అని అన్నపుడు రానా dialogues సరిగ్గా లేవు. ఇంకా convincingగా వుంటే బాగుండేది. ఇది చాలా కీలకమైనది కాబట్టి convincing dialogue వుంటే ప్రేక్షకులు ఇంకా లీనమవటానికి ఆస్కారముండేది
 3. హీరో తండ్రి మరణం తర్వాత CM కి prepare అవుతున్నపుడు హీరో suddenగా assemblyముందు కనిపించటం, slumలో కనిపించటం ఆ సన్నివేశంలో ఇమడలేదు. ఇంకా convincingగా తీసివుండాల్సింది. ఉదాహరణకు TVలో ఒక వార్త చూసి చలించి ఆ ప్రదేశానికి వెళ్ళటం. ఇదే సందర్భంలో హీరో ఒక కాలవ గట్టున కూర్చుని ఒక బీద స్త్రీకి శాలువా (ఏదో ఒక బట్ట) నీట్లో pass చేయటం “గాంధి” సినిమా నుంచి copy చేసినట్టు అనిపించింది.
 4. MLAలకు లంచం ఇచ్చి అవినీత నిరోధక చట్టం తేవటం logicalగా లేదు. గొల్లపూడి చెప్పేవరకు ఆ చట్టం నుంచి MLAలను మినహాయించాలని హీరోకు తట్టకపోవట హాస్యాస్పదం.
 5. గొల్లపూడి పాత్ర ఆగంతకుడిలాగా వచ్చిపోతుంది. కొన్ని మంచి dialogues చొప్పించడానికి వాడుకున్నట్టుగా వుంటుంది.
 6. కోట ఏ హోదాలో ఆ పార్టీ నడుపుతున్నారో స్పష్టంగా లేదు.
 7. హీరోను అంత సులువుగా కాల్చి ధనుంజయ రాజీనామా చేయాల్సి రావటం convincingగా లేదు. ధనుంజయ అంత పెద్ద పొరపాటు చేస్తాడా? ధనుంజయను హోం మంత్రి పదవి తొందరగా తీసేయాలని చేయించినట్టుగా వుంది. అలాకాక హీరోనే ఇలాంటి setup చేసి ధనుంజయను ఇరికించినట్టు చూపిస్తే బాగుండేది.
 8. రిచా (అర్చనా? రచనా?) పాత్ర కూడా అంత strongగా లేదు. Commados ముందు danceలు చేయడం బాలేదు.
 9. రిచా, CM అంత కలుసుకున్నా media రాకపోవటం, ఆమె తండ్రికి తెలియకపోవటం logicalగా లేదు.
 10. ధనుంజయ చెప్పగానే రిచా నమ్మేసి హీరోను వదిలివెళ్ళటం కూడా నచ్చలేదు. అది నిజమేనా అని అడిగి, హీరో అది నిజమే అని చెప్పినపుడు ఆమె వదిలివెళ్తే బానేవుండేది.
 11. బాంబు ప్రేలుడు జరిగినా అసమ్మతి వర్గం ప్రతిఘటించకపోవటం, CM ని గద్దే దింపే meeting తాత్సారం జరగటం logicalగా లేదు. దానికి CM ఇచ్చే జవాబు police academy పెడదామనటం. తర్వాత హీరోయిన్ తో షికారు చేయటం.
 12. బాంబు ప్రేలుడు లాంటి సంఘటన జరిగినపుడు పెద్దాయనను కలుద్దామనుకోవటం, దారిలో హీరోయిన్ తో romance చేయటం ఎమి బాలేదు. ఆ episode ఎప్పుడు ఐపోతుందా అనిపించింది. పైగా commados ముందు danceలు!
 13. CM చెరువులో స్నానం చేసినట్టు ఎందుకు చూపించాల్సివచ్చిందో అర్థంకాలేదు.
 14. రాజినామా చేసినపుడు భరణి “మీలో ఒక leaderని చూస్తున్నా సార్” అనటం మరీ explicitగా అనిపించింది. Just salute చేయటం చూపించి music add చేస్తే బాగుండేది.
 15. అమ్మాయి ని చంపినవాడిని చంపటం ఇంకా కొంచం cleverగా చూపిస్తే బాగుండేది.
 16. రిచా, ప్రియా ఆనంద్ ఆ ఊరేగింపులో హీరో కలవటం నచ్చలేదు. వాళ్ళను కలపాలికదా అని బలవంతంగా కలిపినట్టుగా వుంది.
 17. ఎందుకో ముగింపు ఏ impression create చేయలేదు. పైగా చివరి సన్నివేశం video  quality అస్సలు బాలేదు.
 18. ఇంకా TV programలో ఆ anchor couple episodes నచ్చలేదు.
 19. ధనుంజయ ఏమవుతాడో తెలియకుండా సినిమా ముగుస్తుంది. ధనుంజయ fateTV newsలో చూపించి వుంటే బాగుండేది

నాకు శేఖర్ సినిమాలలో గోదావరి చాలా ఇష్టం. దానికి మించి ఇది వుంటుందని ఆశించా కాని గోదావరిని మించలేదు. Logistics పరంగా చాలా పెద్ద సినిమా ఇది. కాబట్టి అన్నీ దర్శకుడి controlలో వుండి వుండకపోవచ్చు. ఏమైనా bad cinema ఐతే కాదు.