అవతార్ లో వున్న CG charactersకి అంతకు ముందు వచ్చిన motion capture animation సినిమాల్లోని రబ్బరు బొమ్మల్లాంటి CG charactersకి తేడా ఏంటోనని internetలో వెతకటం ప్రారంభించాను. నాకు లభించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు:
1. అవతార్ లో CG పాత్రలు rubber balloonsలాగా వుండి కీళ్ల దగ్గర మాత్రమే కదలికలు వుండే లాగా కాకుండా మనిషిలో వుండే కండరాలు, కొవ్వు మరియు tissuesని కూడా model చేసారు
2. చర్మం రంగు అంతా uniformగా వుంచేయకుండా ఆ నీలం రంగులో (కళ్ళ దగ్గర darkగా, చెంపలపైన lightగా, పెదవులు pinkishగా) రకరకాల shades వాడారు
3. చర్మం texture smoothగా వుంచకుండా కొంచం గరుకుగా కనిపించేలాగా, skin poresని కూడా model చేసారు.
4. ఇంత చేసిన తర్వాత ఈ organic blue coloured CG character మంటల వెలుగులో (orange రంగు వెలుగులో)  gray colourలో అసహ్యంగా కనిపిస్తున్నాయని Na’viల పైన బడి reflect అయ్యే light ని “spectral compensation” ద్వారా మార్చారు
5. ఇంకా చర్మానికి కొత్త subsurface model వాడారు. దీని వల్ల చర్మం క్రింద ప్రవహించే రక్తం రంగు వల్ల చర్మం రంగు (నీలం రంగు)కు ఒక విధమైన shade వస్తుంది.

ఇలా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నందు వల్ల Na’viల చర్మం rubberలాగా అనిపించకుండా organicగా అనిపిస్తుంది.