బొమ్మ-1

Digital సినిమాకు అవసరమయ్యే resolution గురించి, మన కన్ను గ్రహించే resolution గురించి ఇంతకు ముందు వ్రాసుకున్నాను. ఆ పాత టపాలు:

1. Film resolution ఎంత?
2. RED resolution సరిపోతుందా?
3. మనిషి కన్ను మరియు డిజిటల్ కెమెరా పరిధి

ఐతే Apocalypto మరియు 28 Days Later సినిమాలకు HD camera మాత్రమే వాడారు. ఐనా cinema theatreలో ప్రేక్షకులు ఎలా చూసారు? HD resolution సరిపోదని ఇంతకు ముందు వ్రాసిన టపాలో వేసిన లెక్కలను బట్టి  అనుకున్నాను. మరి ప్రేక్షకులు low quality videoను ఎలా ఆదరించారు. నేను ఆ రెండు సినిమాలు theatreలో చూడలేదు మరి. ఇన్నాళ్ళు ఆ ప్రశ్న నన్ను వెంటాడుతూవచ్చింది.

ఈ మధ్యనే నా మిత్రుడు ఆనంద్ చూపించిన వ్యాసం ఒకటి చదివాను. ఆ వ్యాసం John Galt అను ఒక Digital Imaging expert (ఇతనే ప్రఖ్యాత camera design and rental company Panavisionకి Senior Vice President కూడా) వ్రాసింది. ఈ వ్యాసంలో నేను గ్రహించిన 3 ముఖ్యమైన విషయాలు:

1. theatre లాంటి ambient light (పరిసర కాంతి) level లో మన కన్ను ఎక్కువ resolution గ్రహించలేదు
2. resolution తక్కువ వున్నా frame rate ఎక్కువ వుంటే video quality కంటికి బాగుంటుంది. 24 fps (frames per second)తో తీసిన వీడియో కన్నా 48fpsతో తీసిన వీడియో quality ఎక్కువనిపిస్తుంది (ఆ వీడియో లో కదలికలు ఎక్కువగా వుంటే).
3. high dynamic range imaging వల్ల quality మరింత పెంచవచ్చు. దీని కోసం Panavision వాళ్ళు Dynamax అని ఒక కొత్త sensor technology రూపొందిస్తున్నారు.

ఐతే నన్ను వెంటాడిన ప్రశ్న( ప్రేక్షకులు low quality videoను ఎలా ఆదరించారు?)కు సమాధానం పైన వ్రాసిన మొదటి pointలో వున్నట్టు అనిపించింది. ఆ విషయం గురించి తెలుసుకోవాలని Google లో వెతికాను. నాకు లభించిన సమాచార సారాంశం ఇది. మనిషి చూపు మన పరిసర కాంతితో మారుతుంది. ఇది మూడు రకాలుగా వుంటుందని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు.

1. Photopic: ఎక్కువ పరిసర కాంతి
2. Scotopic: తక్కువ కాంతి (రంగులు కనిపించవు)
3. Mesopic: మధ్యస్థంగా వుండే కాంతి.

కాంతి తీక్షణతను బట్టి మన కంటి rods and cones activity మారుతుంది (బొమ్మ-1). Theatreలో మనకు వుండే చూపు mesopic చూపు. Contrast గ్రహించే శక్తి కూడా ఈ మూడు చూపుల్లో భిన్నంగా వుంటుంది. Photopic లో తక్కువ contrastను కూడా గ్రహించే శక్తి వుంటే scotopicలో contrast ఎక్కువ వుంటే గానీ మనం గ్రహించలేము. ఈ contrast sensitivity బొమ్మ-2 లో చూడొచ్చు.x-axisలో వున్న cycles/degree కంటిలో ఏర్పడే బొమ్మ size. y-axis నలుపు ఎంత నలుపో తెలుపు ఎంత తెలుపో తెలుపుతుంది. cycles/degree ని అర్థం చేసుకోవటానికి బొమ్మ-3 చూడొచ్చు.

బొమ్మ-2

ఉదాహరణకు 10 cycles/degree size (అంటే )తో కంటిలో ఏర్పడే బొమ్మకు photopicలో కనీసం 0.5% contrast కావాలి. 100% contrast వున్నా (అంటే నలుపు పూర్తి నలుపు తెలుపు పూర్తి తెలుపు)

బొమ్మ-3

కన్ను60cycles/degree size (అంటే రెటినాపై 1/60 degrees కోణం ఏర్పరిచే బొమ్మ) వున్న బొమ్మనే చూడగలుగుతుంది mesopic mode లో. ఇక mesopic modeలో కన్ను గ్రహించే అత్యల్ప contrast (బొమ్మ-2) 0.9%. ఆ 0.9% contrastతో ఆ బొమ్మ కంట్లో కనీసం 1/6 degree (6 cycles/degree) కోణం ఏర్పాటు చేయాలి. Pixelకి Pixelకి మధ్య (అసలుకైతే Macroblockకి Macroblockకి మధ్య; Macroblock అంటే 16×16 pixels) contrast 0.9% కన్నా తక్కువ వుండేలా చూసుకుంటే (video coding లో loop filter ద్వారా ఇది control చేయొచ్చు), మన resolution requirement లెక్క మారిపోతుంది.

N > 1.2/ (tan[1/12])

=> N > 825

అంటే వీడియో resolution 1466×825 వుంటే theatreలో చూడాటానికి సరిపోతుంది. HD resolution 1920×1088 దాని కన్నా ఎక్కువ కనుక ప్రేక్షకులు ఆ సిన్మాలన్నీ theatreలో చూడగలిగారు.

References:

1. http://www.telescope-optics.net/aberrations_extended.htm