నా దృష్టిలో సినిమాకు script వ్రాయటం చాలా కష్టమైన పని. గొప్ప దర్శకులు ఆ వ్రాత పని ఎలా చేస్తారనే కుతూహలం వుంటుంది నాకు.  ఈ మధ్యనే “Madeo” సినిమా దర్శకుడి ఇంటర్వ్యూలు కొన్ని చదివాను. వాటిల్లోంచి కొన్ని ఆసక్తికరమైన విషయాలు:

1. నేను దర్శకత్వం వహించిన సినిమాలన్నీ నేను వ్రాసుకున్నవే. ఐతే ఇతర రచయతల సాయం తీసుకుంటా. నేను ఒక్క  ప్రదశంలోనే కూచుని వ్రాయలేను. Script writing ప్రక్రియ చాలా కష్టమైంది నాకు.  నేను regularగా వెళ్ళే cafeలకు coffe shopలకు వెళ్తాను.  అక్కడ ఒక మూలలో నా computer connect చేసుకుని పనిచేసుకుంటా. ఎన్ని రణ గొణ ధ్వనులున్నా పని చేసుకోగలను. ఆ పరిసరాలే నన్ను ప్రేరేపిస్తాయి. ఒక్కోసారి వారాలు నెలలు వ్రాయలేను. అప్పుడు నాకు ఇష్టమైన సినిమాలన్నీ చూస్తా. ఆ సినిమాలకు నా సినిమా కథకు సంబంధం ఏమీ లేకున్నా నేను చిన్నప్పుడు ఇష్టపడ్డ ఆ సినిమాలను చూస్తా. ఒక్కోసారి ఒక 10 లేదా 20 DVDలు తీసుకొని వాటిల్లో నాకు ఇష్టమైన సీన్లన్నీ చూస్తా.  Writers block నుండి బయట పడటానికి ఇవన్నీ తోడ్పడతాయి.

2. Madeo (Mother) సినిమా గురించి: 2004లో అనుకున్న కథ ఇది (2009 లో విడుదలయ్యింది). తల్లి పాత్రలో నటించిన Hye-ja Kim మా దేశంలో ప్రఖ్యాత నటి. ఆవిడ నటన ప్రపంచానికి చూపెట్టటానికే ఈ సినిమా చేయటానికి ప్రేరణ.

3. Alan Moore comics కి నేను పెద్ద అభిమానిని. Alan Moore comic “From Hell” నా “Memories of a Murderer”కి ప్రేరణ.

4. తదుపరి చిత్రం Chan-wook Park (Old boy దర్శకుడు) నిర్మిస్తున్నారు. “Transperceneige” అను science fiction graphic novel ఆధారంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. 2012 కల్లా విడదల అయ్యే అవకాశం వుంది.

References:

1. http://www.collider.com/entertainment/archive_detail.asp/aid/3718/cid/13/tcid/1

2. http://www.collider.com/entertainment/interviews/article.asp?aid=11293&tcid=1