మన తెలుగు సినిమా దర్శకులు వారి మొదటి సినిమా కోసం పడిన పాట్లు, చేసిన ప్రయత్నాలు తెలుసకుంటే ఔత్సాహిక దర్శకులకు ఉత్తేజాన్ని ఇస్తాయి. “మొదటి సినిమా” అను  శీర్షికతో కిరణ్ ప్రభ గారు కౌముది అను అంతర్జాల మాస పత్రికలో ప్రతి నెలా ఒక దర్శకుడి సినీప్రస్థానం ఆ దర్శకుడి ఇంటర్ వ్యూ ద్వరా అందిస్తున్నారు. 2006 జనవరి సంచికతో మొదలుపెట్టిన ఈ ఇంటర్వ్యూలన్నీ ఇక్కడ చూడొచ్చు (ఆ పేజీ అడుగున చూడాలి).

కౌముదిలో లిఖిత రూపంలో వస్తే “Sunita blogs” లో Y.సునీత చౌదరి గారు వీడియో రూపంలో అందిస్తున్నారు. ఎన్నో సినిమాలు తీసిన పాత దర్శకులవే కాక మొదటి సినిమా తీయబోతున్న దర్శకుల ఇంటర్వ్యూలు కూడా ఇక్కడ చూడొచ్చు.KNT శాస్త్రి, E. నివాస్ మరియు ఇంద్రగంటి గారి ఇంటర్వ్యూలు తప్పక చూడవలసినవి.