దక్షిణ కొరియా దర్శకుడు Bong Joon-ho తాజా చిత్రం ఈ Madeo (అమ్మ). 2000లో దర్శకత్వం వహించిన Salinui chueok (2003) aka Memories of  Murder పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న Bong Joo-hoకు ఇది ఆరవ చలన చిత్రం. మిత్రుడు శ్రీ అన్వర్ నాకు ఈ దర్శకుడిని పరిచయం చేసారు. మిత్రుడు ceenu గారు కూడా ఈ చిత్రాన్ని గురించి చెబితే ఈ వారమే ఈ సిన్మా చూసాను. ఈ చిత్రం చూస్తే దర్శకుడి ప్రతిభ తెలుస్తుంది. ఇతని నుంచి మంచి చిత్రాలు మరిన్ని వస్తాయని నమ్మకం కలుగుతుంది. ఒక తల్లి బుద్ధిమాంద్యుడైన తన కొడుకు పైన కబరిచే అవ్యాజమైన ప్రేమను చాలా హృద్యంగా తెరకెక్కించాడు.

ఒక హత్య కేసులో ఈమె కొడుకుని నిందితుడిని చేస్తారు పోలీసులు. తన కొడుకు అమాయకుడని నిర్దోషి అని నిరూపించడానికి ఆ తల్లి ఎన్నో ప్రయత్నాలు, పనులు చేస్తుంది. తల్లిగా చేసినావిడ అద్భుత నటన కనబరిచింది. చివరికి అసలు నిందితుడితో ఆమె మాట్లాడే సన్నివేశం ఆమే నటనకు తార్కాణం. ఈవిడ నటన కోసమైనా తప్పకచూడవలసిన చిత్రం ఇది.

ఆసక్తికరమైన కొన్ని అంశాలు:
ఈ చిత్రం ఆరంభంలో తల్లి మైమరిచి (కరాళ) నృత్యం చేయటం కనిపిస్తుంది.ఎందుకు ఈ నాట్యం అనిపిస్తుంది. ఆ సన్నివేశానికి కారణం సినిమా చివరిలో తెలుస్తుంది. ఈ సినిమా ఒక టెక్నిక్ నాకు నచ్చింది. ఒక పాత్రకు చిన్నప్పుడు జరిగిన సంఘటన ప్రేక్షకుడికి అది ఏమటో అని తెలియకుండా తెరపై కనిపిస్తుంది. అలా కనిపించినపుడు ప్రేక్షకుడికి అది ఏమిటో అర్థం కాదు. తర్వాత (ఒక పావుగంట తర్వాత అనుకుంట) ఆ పాత్ర తన చిన్ననాటి సంఘటన గుర్తు తెచ్చుకొని చెబుతుంటే (ఈ సారి ఆ వీడియో మళ్ళీ కనిపించదు) ప్రేక్షకులు అప్పుడు చూసిన సంఘటనకు link చేసుకుంటారు. ఇప్పటికే పలు చిత్రోత్సవాలలో పాల్గొన్న ఈ చిత్రాన్ని తప్పక చూడాలి.