బొమ్మ: “ఘరే బాయ్ రే” సినిమాలో బిమల పాత్ర వస్త్రధారణ చిత్రిస్తున్న రాయ్ (1982)

ఈ మధ్యనే “Satyajit Ray- An Artist in Him” అన్న ఒక డాక్యుమెంటరీ చూసాను. 64 నిమిషాల ఈ చిత్రానికి రచన-నిర్మాత-దర్శకత్వం “నితీశ్ ముఖర్జీ”.  సినిమా సర్టిఫికెట్లో ఈ చిత్రనిర్మాణ సంవత్సరం 2008 అని వుంది. మరీ పాత చిత్రం కాదన్న మాట. ఇప్పుడు లభిస్తున్న softwareతో technical ఎంతో బాగా వుండవలసిన చిత్రం నిరాశపరుస్తుంది. రాయ్ కళాకారుడిగా తెలియని వారికి బాగా ఉపయోగపడుతుంది. కాని రాయ్ అభిమానులు కొత్తగా తెలుసుకునే విషయాలు అంతగా లేవు. రాయ్ అభిమాన కళాకారుల గురించి, రాయ్ తయారు చేసిన English, Bengali fonts మొదలైన విషయాలు నిర్లక్ష్యం చేయబడ్డాయి.

ఒక ఆసక్తికరమైన విషయం: బాపు గారికి, రాయ్ కి చాలా పోలికలు వున్నాయి. వీరిద్దరూ సినిమాలు చేయకముందు visualisation artistలుగా పనిచేసిన వాళ్ళే. ఇక ఈ చిత్రానికి సంగీతం: ప్రబుద్ధ రాహా, కూర్పు: సందీప్ పాల్.