నవతరంగంలో ప్రచురణ: May 23, 2009 at 4:34 pm


Natali Teumian చిత్రం

బొమ్మ 1 : Natali Teumian చిత్రం

హకొబ్ హొవ్నతాన్యన్ (Hakob Hovnatanyan) (1806-1881) ఒక ఆర్మేనియా కళాకారుడు. ఆ కళాకారుడి పైన 1967 లో వచ్చిన 10 నిమిషాల డాక్యుమెంటరి ఈ చిత్రం : Hakob Hovnatanyan. హకొబ్ హొవ్నతాన్యన్ portrait artist గా ప్రసిద్దుడు. మేటి ఐరోపా portrait కళాకారుల్లో ఈయన ఒకరు.

పుట్టింది Tiflis లో(ఇప్పుడు అదే – Tbilisi, జార్జియా రాజధాని). నేర్చుకున్నది చర్చి కళాకారుడైన తన తండ్రి Mkrtum Hovnatanyan నుంచి. తన 23వ ఏట Academy of Fine Arts లో చేరడానికి రష్యాలోని పీటర్స్ బర్గ్ వెళ్ళి అక్కడా మంచి పేరు సంపదించాడు.

15శతాబ్దాలుగా రివాజుగా వస్తున్న మతపరమైన చర్చి కళను కాకుండా లౌకిక కళకు పునాది వేసాడు .

హకొబ్ హొవ్నతాన్యన్ అంటే గుర్తుకొచ్చేది 1830-40 లో వేసిన Natali Teumian చిత్రం. ఆ కళాకారుడి పైన చేసినదే ఈ డాక్యుమెంటరీ.

ఇంతకి ఈ డాక్యుమెంటరి దర్శకుడు ఎవరంటే “Colour of Pomegranate” దర్శకుడైన పరజనొవ్.

హకొబ్ హొవ్నతాన్యనన్ portraits లో వున్న ముఖ్యాంశాలు (కళ్ళు, చేతులు, అలంకార ప్రాయమైన డిజైన్లు మొ||) పరజనొవ్ మొదటి 2-3 నిమిషాల్లో చూపిస్తాడు. కాని తర్వాత్తర్వాత కొంచం abstract అయిపొతుంది. అది అర్థం కావాలంటే ఆర్మేనియా సంస్కృతి తెలియాలేమో మరి.

123

ఈ చిత్రాన్ని చూడాలకునేవారు ఇక్కడ చూడొచ్చు (వీలయితే ఒక సమీక్ష వ్రాయండి.)