pKetaki2_pic_rtvovillaocampo

Ocampo ఆతిథ్యంలో మహాకవి టాగోర్

1924 నవంబర్లో అర్జెంటినా వెళ్ళినపుడు మహాకవి టాగోర్ (బెంగాలీలు ఠాకుర్ అంటారు)కు Victoria Ocampo Aguirre అను ఒక రచయిత్రి పరిచయం ఏర్పడింది. తర్వాత ఇద్దరు ఒకరికొకరు ఉత్తరాలు వ్రాసుకున్నారు. టాగోర్ ఆమెకు విజయ అని నామకరణం చేసారు. ఆ పరిచయం అభిమానంగా మారింది. 1925లో టాగోర్ తన కవితా సంకలనం “పూరబి”  Ocampoకు అంకితమిచ్చారు. వీరిపైన వ్రాద్దామని ప్రయత్నించిన ప్రముఖ రచయత సునిల్ గంగోపాధ్యాయ్ తివ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. రెండేళ్ళ క్రితం దర్శకుడు Pablo César గోవా చలనచిత్రోత్సవానికి వచ్చినపుడు మన అర్జెంటినా రాయబారి ఆయనకు ఈ విషయం చేప్పారంట. అది విన్న Pablo Césarకు ఈ విషయంపైన ఒక సినిమా తీయాలనే ఆలోచన వచ్చింది. తారాగణం ఇంకా నిర్ణయం కాలేదు. ఐతే shooting శాంతినికేతన్, Paris మరియు Argentinaలో చేద్దామనుకుంటున్నారంట. ఈ సినిమాకు Ketaki Kushari Dyson వ్రాసిన “Your Blossoming Flower Garden”ని అధారంగా తీసుకుంటారంట.

References:

1. 26 October 2009, Outlook

2. http://www.parabaas.com/rabindranath/articles/pKetaki1.html

ప్రకటనలు