Canon7D

Canon 7Dతో “That Girl in Yellow Boots” సినిమా మొదలుపెట్టినట్టు అనురాగ్ కశ్యప్ PFC blogలో ప్రకటించారు [1]. అసలు ఈ Canon 7D camera వివరాలు ఏంటని వెతికాను. నేను తెలుసుకొన్న వివరాలు ఇక్కడ పొందుపరుస్తాను.  SLR camera ఐన Canon 7Dతో 18 Mega pixel ఫోటోల తీసుకోవచ్చు, అంతేకాకుండా video shooting కూడా చేయొచ్చు. మరి professional camocorder Canon XL-H1Sకి దీనికి గల వ్యత్యాసం ఏంటి? Red Oneకి Canon 7Dకి గల వ్యత్యాసం ఏంటి? కొన్ని ముఖ్యమైన అంశాలు చూద్దాం:

Canon 7D Canon XL H1S Canon HV30 Red One
Output format 1920×1084

30/25/24 fps
4:2:2 H.264

1440×1084

30/25/24 fps
4:2:0 HDV

1440×1084

30/25/24 fps
4:2:0 HDV

4520×2580

30/25/24/29.97/23.98 fps
RGB Raw

Sensor size 22.3mm x 14.9mm 4.80mm x 3.60mm 5.27mm x 3.96mm 24.4mm x 13.7mm
ISO 100-6400 200
ఖరీదు (డాలర్లలో) 1700 6000 800 17500

మామూలు film camera లో ఏర్పడే బొమ్మ size 22mmx19mm అని చూసాము. (35mm image అను ఒక ప్రమాణం వుంది. దాని size 36mmx24mm). Canon 7D, Red One sensor sizeలు film బొమ్మ sizeకి దగ్గరగా వున్నాయి. కాబట్టి film camera వల్ల లభించే depth of field లాంటి depth of field Canon 7D వల్ల లభిస్తుంది. పైగా Canon 7D ఖరీదు అందుబాట్లో వుంది. అంతే కాకుండా విరివిగా లభించే SLR camers lensలన్నీ సునాయసంగా వాడుకోవచ్చు. ఐతే ఈ camera తో shootingకు కావలసిన setup వేరేగా తీసుకోవాలి [2]. దాని ఖరీదు దాదాపు $2500.

redrock_DSLR_3qtr_lg

Canon 7Dతో తీసిన ఒక లఘు చిత్రం ఇక్కడ చూడొచ్చు. Film camera video qualityకి దగ్గరగా వుందని గమనించవచ్చు.  ఐతే ఇక్కడ, తర్వాత ఇక్కడ చర్చించినట్టు, ఈ cameraతో shooting చేస్తే theatreలో చూసే print video quality బాగుండదు.

References:
1. http://passionforcinema.com/announcing-that-girl-in-yellow-boots/
2. http://www.redrockmicro.com/products.html

ప్రకటనలు