filmIns

2007 లో సినిమా పరిశ్రమ విలువ 9600 కోట్ల రూపాయలు. 2012లో అది 17600 కోట్ల రూపాయలు అవుతుందని అంచనా [2]. అంత డబ్బు వున్న దగ్గర risk కూడా ఎక్కువే. పైగా ఈ మధ్య వస్తున్న చాలా సినిమాలు డబ్బు పోగొట్టుకున్నవే. అలాంటప్పుడు ఆ సినిమాను బీమా చేస్తే ఎలా వుంటుంది? 1998 సంవత్సరంలో ఇదే ఆలోచన చేసి తన సినిమా “తాల్” (హిందీ) ని బీమా చేయించి భారతీయ సినిమాకు బీమా రుచి చూపించిన ఘనత సుభాష్ ఘాయ్ ది. London మరియు Tokyo insurance companyలు నిరాకరిస్తే మన దేశపు company United India Insurance (UII)ఆరు నెలలు ఆలోచించి బీమా ఇవ్వడానికి ఒప్పుకుంది. ఘాయ్ ఆ సినిమాను 11 కోట్లకు బీమా చేయించారు. బీమా సంస్థ 3% దాకా premium (మామూలుగా 0.25% వసూలు చేస్తారంట)వసూలు చేశారని వార్తలు వచ్చాయి [3]. తాల్ సినిమాకు 15 లక్షల premium కట్టారు. ఐతే ఈ బీమా సినిమా విడుదల అయిన తర్వాత వచ్చే నష్టానికి కాదు. బీమా చేయడానికి ఈ క్రింది అంశాలు పరిగణలోకి తీసుకుంటారు:

1. ముఖ్య తారాగణం, దర్శక శాఖ, Technicians etc.
2. Properties, Sets, Production Equipments, Negatives etc.
3. Public Liability
4. Money Insurance
5. Workmen Insurance
6. Accident Insurance

ఈ కారణాల వల్ల అవసరమయ్యే reshooting ఖర్చులకు కూడా బీమా వుంది. “ఖలనాయక్” సినిమా షూటింగ్ సమయంలో సంజయ్ దత్ ని పోలీసు arrest చేయడం వల్ల నష్టం చవి చూసిన ఘాయ్ అలా సినిమా బీమా వాడుకోవడంలో ఆద్యుడయ్యాడు. అలా సినిమా బీమా మొదలుపెట్టిన UII తర్వాత చాలా సినిమాలకు బీమా ఇచ్చింది: మొహబ్బతే, లగాన్, కభి ఖుషీ కభి గమ్, అశోకా, దిల్ చాహ్తా హై ఇలా చాలా. జూన్ 2003 వరకు 42 సినిమాలకు బీమా ఇచ్చింది. మొహబ్బతే షూటింగ్ సమయంలో ఐశ్వర్య రాయ్ కు ప్రమాదం జరిగితే నిర్మాత యశ్ చోప్రాకు బీమా ఉపయోగపడింది. సినిమా budgetలో బీమా ఖర్చు 1-3% మాత్రమే కాబట్టి, తెలుగు సినిమా నిర్మాతలు ఆలోచించవచ్చు.

References:
1. http://www.thehindubusinessline.com/catalyst/2008/04/24/stories/2008042450020100.htm
2. http://www.pwc.com/in/en/press-releases/indian-entertainment-media-industry.jhtml
3. http://www.indianexpress.com/ie/daily/19981230/36450124.html

ప్రకటనలు