filmCans

ఈ మధ్య సినిమా నిర్మాణానికి  Digital technology (Red One cameraతో ఈనాడు), 16mm film వాడటం (బాణం సినిమా) జరిగినట్టు మనకు తెలుసు. ఈ పద్దతుల వల్ల ఖర్చు తగ్గించడానికి ప్రయత్నించారు.  ఐతే 35mm film వాడితే ఎంత ఖర్చు అవుతుంది? ముందుగా ఎంత film కావాలో లెక్క కడుదాం.

35mmAnaFilm

(బొమ్మ 1)

ఒక్క frame పొడుగు 0.75 ఇంచులు వుంటుంది. సెకనుకు 24 frameలు అని తెలుసు మనకు. అంటే 24×0.75 = 18inches (= 18/12 = 1.5 feet) film కావాలి ఒక సెకనుకు.  అంటే ఒక నిమిషానికి 1.5ft/sec x 60sec/min = 90ft film కావాలి. సినిమా నిడివి రెండున్నర గంటలు (= 2.5×60 = 150 నిమిషాలు) ఐతే, shoot చేసేది దాదాపు మూడు నుంచి ఐదు రెట్లు వుంటుంది. అంటే (నాలుగు రెట్ల shooting: 2.5×4 = 10) పది గంటల film edit చేసి రెండున్నర గంటల సినిమా చేస్తాము. పది గంటల filmకు (10hours) x (60min/hr) x (90ft/min) = 54000 అడుగుల film కావాలి. Film canలో వుండే పొడుగు 200ft లేదా 400ft లేదా 1000ft (1000ft అంటే ఒక reel) అయ్యుండొచ్చు.  మామూలుగా వాడే canలో 400 అడుగుల film వుంటుంది. కాబట్టి (54000ft)/ (400ft/can) = 135 canలు కావాలి. ఒక్క 400 feet can ఖరీదు 11000 రూపాయలు వుంటుందంట (Reference: ceenuగారు). 135 canల ఖరీదు 135×11000 = 14.85 లక్షలు. Film budget 2 కోట్లు అనుకుంటే film ఖర్చు (14.85×100)/200 = 7.5 శాతం మాత్రమే.  15 లక్షల కన్నా ఎక్కువ ఆదా చేయగలిగితే digital shooting లేదా 16mm film వాడొచ్చు.

ప్రకటనలు