manbeyond

(చిత్రంలో ఒక దృశ్యం – చిత్ర దర్శకుడు)

సెప్టెంబరు 19న కెనెడా దేశంలో ముగిసిన 34వ టొరాంటో ఫిల్మ్ ఫెస్టివల్లో (TIFF- Toronto Film Festival) మన దేశానికి చెందిన కొంకణి చిత్రం “Paltadacho Munis (The Man Beyond The Bridge)”కు ఒక అవార్డు దక్కింది.  FIPRESCI (Fédération Internationale de la Presse Cinématographique -International Federation of Film Critics) వారు “Discovery” కార్యక్రమం నుండి ఈ అవార్డు ప్రకటించారు.

ఈ చిత్ర దర్శకుడు 34 ఏళ్ళ లక్ష్మీకాంత్ శెట్గావంకర్ (Laxmikant Shetgaonkar)కు నాటకానుభవంతో పాటు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా లో నటనను బోధించిన అనుభవం వుంది. 2005లో ఈయన నిర్మించిన “A Seaside Story” అను డాక్యుమెంటరీకి జాతీయ స్థాయిలో అవార్డు లభించింది. “The Man Beyond The Bridge” చిత్రం దర్శకుడికి మొదటి feature film. భార్యను పోగొట్టుకున్న ఒక forest rangerకి ఒక (మానసిక వికలాంగురాలు) పిచ్చి స్త్రీ కి మధ్య ఏర్పడ్డ అనుబంధం వల్ల జరిగిన పరిణామాలతో సాగే గోవా రచయత మహాబలేశ్వర్ సయిల్ కథ అధారంగా నిర్మింపబడ్డ చిత్రం ఇది. కొంకణి భాషను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చినందుకు గోవా ప్రభుత్వం 25 లక్షల నగదు బహుమతి ప్రకటించింది.

ఈ వార్తలో నన్ను ఆకట్టుకున్న విషయం:
“ఈ చిత్ర నిర్మాణానికి అవసరమయ్యే ఆర్థిక వనరులను కల్పించుకోవడానికి మూడేళ్ళు కష్టపడ్డాడు దర్శకుడు. చివరికి NFDC funds సాధించాడు.”

(ఇక్కడ ప్రకటించిన Credits ప్రకారం NFDC చిరునామా:

National Film Development Corporation Limited,
Discovery of India Building, 6th Floor, Nehru Centre,
Dr. Annie Besant Road, Worli, Mumbai,
Maharashtra 400018 India. T (91-222) 494-9971 F (91-222) 495-2262
nina@nfdcindia.com )

ప్రకటనలు