redCamera

బొమ్మ 1

ఈ మధ్య డిజిటల్ సినీ నిర్మాణం RED కెమెరాతో (బొమ్మ 1) చేస్తున్నారని మన అందరికి తెలిసిన విషయమే.  కమల్ హాసన్, వెంకటేశ్ నటించిన “ఈనాడు” సినిమా కూడా RED కెమెరాతో తీసిందే. ఐతే ఆ కెమెరా Technical Specifications ఏమిటని చూసి ఆశ్చర్యపోయాను.  RED చిత్రీరించే ప్రతి frame resolution 4096×2304 (వెడల్పుxఎత్తు) pixels. అంటే మన 10 Megapixels కెమెరా తీసే ఛాయాచిత్రం resolution కన్నా తక్కువ.  మరి అది సరిపోతుందా? తెలుసుకుందామని కొంత సమాచారం సేకరించాను.

ఆ resolution సరిపోతుందా లేదా అనే విషయం తెలుసుకునేముందు కొన్ని సంగతులు:

1. మన డిజిటల్ కెమెరాతో తీసిన ఛాయాచిత్రాలు 96dpi (dots per inch)తో ముద్రిస్తారు. అంటే 4″x6″ printలో 384×576 pixels వుంటాయి (4″x6″ print మాత్రమే వేసుకోవాలనుకుంటే 2 Megapixel కెమెరా సరిపోతుంది  )

2. India Today లాంటి పత్రికలు (మన స్వాతి వారపత్రిక ముఖచిత్రం కూడా) 120dpiతో ముద్రిస్తారు. అంటే, ఆ ముఖచిత్రంలో960×1260 pixels వుంటాయి. (దిన పత్రికల్లో 75dpi వాడతారు).

మరి ఈ printing (ఆ మాటకొస్తే display) resolution వెనక వున్న లోగుట్టు ఏంటి? 20/20 చూపువున్న మన కన్ను (అంటే ఆరోగ్యకరమైన కన్ను)  రెండు ప్రక్కప్రక్కన వున్న గీతలను రెండు గీతలుగా గుర్తించగలగాలంటే, ఆ గీతల మధ్య వున్న నిడివి 20 ft దూరంలో వున్న కన్ను దగ్గర కనీసం (1/60) డిగ్రీల కోణం సృ ష్టించాలి (బొమ్మ 2).  75dpiతో ముద్రించిన చిత్రాన్ని 3cm దూరం నుంచి చూసినా ఆ చిత్రంలో చుక్కలు (dots) కనిపించవు ఎందుకంటే రెండు ప్రక్కప్రక్క చుక్కలు 20 ft దూరంలో  (20ft దూరం ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ) కన్ను దగ్గర ఏర్పరిచే కోణం 2*arctan{1/(75*2*20ft*12inch/ft)} = 0.0032 డిగ్రీలు. 0.0032 డిగ్రీలు  1/60 = ౦.౦17 డిగ్రీలకన్నా చాలా తక్కువ కాబట్టి మన కన్ను ఆ రెండు చుక్కలను గుర్తించలేదు. ఇక ఆ చిత్రం చలనచిత్రం ఐతే ఆ చుక్కల మధ్య వున్న నిడివి కనీసం (1/40) డిగ్రీల కోణం కన్నువద్ద ఏర్పర్చాలి.

bomma2

బొమ్మ 2

ఇక RED resolutionని పరిశీలిద్దాం. Society of Motion Picture and Television Engineers (SMPTE) ప్రమాణాల ప్రకారం సినిమా థియేటర్లో మొదటి కుర్చీల వరుస ఎంత దూరంలో వుండాలి (బొమ్మ ౩) అంటే తెర వెడల్పు  మొదటి వరుసలో కూర్చున్న మనిషి కన్నువద్ద 61.8 డిగ్రీల కన్నా తక్కువ కోణం ఏర్పర్చాలి.

viewDist

బొమ్మ 3

తెర వెడల్పులో N pixels project చేస్తున్నామనుకుంటే, రెండు ప్రక్కప్రక్క వున్న pixels ప్రేక్షకుడి కన్ను వద్ద ఏర్పరిచే కోణం (బొమ్మ 4)  (1/40) డిగ్రీలకన్నా తక్కువ వుండాలి. తెర 20ft కన్నా ఎక్కువ దూరంలో వుంటుంది కాబట్టి తెర perspective/projection కొలతలు పరగణించాలి.

bomma4N

బొమ్మ 4

N > 1.2/ (tan[1/80])

=> N > 5500

RED కెమెరా తో లభించేది 4096. కాబట్టి మొదటి వరుసలో కూర్చున్నవారికి వీడియో నాణ్యత తక్కువగా అనిపించొచ్చు. ఆ సమస్య లేకుండా చూడాలంటే ప్రేక్షకుడు ఎంత దూరంలో వుండాలంటే తెర వెడల్పు  ప్రేక్షకుడి కన్ను వద్ద  ఏర్పరిచే కోణం 2*arctan([N/2]*tan(1/80)) = 48 డిగ్రీలు అయ్యుండాలి.  అంటే, తెర వెడల్పు ౩౦ft అనుకుంటే మొదటి కుర్చీల వరుస 15/tan(24) =  33.5ft దూరంలో వుండాలి. ప్రస్తుతం film లో చిత్రీకరించిన చిత్రాలను కూడా 2048 pixels తో scan చేసి DI (Digital Intermediate)/Special Effects చేస్తున్నారు. మరి విడియో నాణ్యత ఎలా వుందో తెలియదు.

ఏమైనా RED camera resolution పెంచితే కాని మనం video archivingకి ఈ కెమెరా వాడలేమేమో.

ప్రకటనలు