3వ శతాబ్దంలో Chen Shou వ్రాసిన “Records of Three Kingdoms” అను చారిత్రాత్మక రచన ఆధారంగా ప్రఖ్యాత దర్శకుడు John Woo మండారిన్ చైనీస్ లో తీసిన సినిమా  ఇది. దృశ్యపరంగా ఒక అద్భుతం. ప్రతి ఒక సన్నివేశం బాగుంది. ఎక్కడా విసుగు లేకుండా అందంగా వుంటుంది.  నిర్మాతలకు చాలా లాభాలు తెచ్చిపెట్టింది.

యుద్ద సన్నివేశాలలో “౩౦౦” సినిమా ముద్ర కనిపిస్తుంది.  Sun Quan పులిని వేటాడే సన్నివేశం బాగుంది. ఆ సన్నివేశంలో పులి చనిపోయినట్టు చూపిస్తే బాగుండేదేమో. తాబేలు ఆకారంలో సైనిక వ్యూహం పన్నడంలాంటివి మన భారతంలోని పద్మవ్యూహమును గుర్తు చేస్తాయి.  ఒక సన్నివేశం  Sun Quan వదిలే పావురంతో మొదలయ్యి, ఆ పావురాన్ని వెంబడిస్తూ Cao Cao నావిక దాళాన్ని చేరడం చాలా బాగుంది. యుద్ద సన్నివేశాలన్ని చాలా బాగున్నాయి.

ఈ సినిమాకు రెండవ భాగం “Chi bi xia: Jue zhan tian xia” 2009లో వచ్చింది. నేనింకా రెండో భాగం చూళ్ళేదు. త్వరలోనే చూస్తా.