Cannes 2008 లో “Prix Un Certain Regard” విజేత ఐన కజాకిస్తాన్ సినిమా తుల్పాన్ (Tulpan) ఎప్పట్నుంచో చూద్దామనుకుంటున్నా. ఇన్నాళ్ళాకు DVD విడుదల అయ్యింది.  డాక్యుమెంటరీ చిత్రాల దర్శకుడు Sergey Dvortsevoy కు ఇది మొదటి చలన చిత్రం. డాక్యుమెంటరి చిత్రాల అనుభవం కాబోలు ఈ సినిమాలోని ప్రతీ సన్నివేశం నిజంగా మన కళ్ళ ముందరే జరుగుతోందన్న అనుభూతి కలిగేలాగ తీసారు.

కథా కమామిషూ :

Tulpan-1

నావికుడిగా పనిచేసిన ఒక యువకుడు “ఆస” (Asa) తన ఊళ్ళో స్వంత “Ranch”, గొర్రెలు, ఒంటెలు, ఇల్లు ఏర్పచుకోవాలనె కలతో తన తోబుట్టువు ఇంటికి వెళ్తాడు. ఆస అక్క “సమల్” (Samal) ముగ్గురు పిల్లలు, గొర్రెల మందకు కాపు కాసే భర్తతో ఎడారిలో ఒక చోట నివాసం వుంటుంది. గొర్రెలమంద యజమాని ఆస ఒక ఇంటి వాదైతేగాని కొత్త గొర్రెల మంద ఆసకు అప్పగించనంటాడు. ఎలాగైనా పెళ్ళి చేసుకొని తన కలలను నిజం చేసుకోవాలని పరితపిస్తాడు ఆస. తన బావ “ఓందాస్” (Ondas), మిత్రుడు “బోని” (Boni) తో ఒక అమ్మాయి ఇంటికి పెళ్ళి ప్రస్తావనతో వెళ్తారు. ఆ అమ్మాయి పేరే “తుల్పాన్”.  కన్యాశుల్కం ఇంత చెప్పి ఖాయం చేసుకుందామని అనుకుటారు. ఐతే ఆ తుల్పాన్ తల్లిదండ్రులు తుల్పాన్ కు ఆస పెద్ద చెవులు నచ్చలేదని ఈ పెళ్లి కుదరదని చెప్పేస్తారు. అమ్మాయి  ని చూడ్డం కుదరకున్నా ఆ అమ్మయినే చేసుకోవాలని నిశ్చయించుకుంటాడు ఆTulpan-5స. తుల్పాన్ తల్లికి ఆసకు ఉద్యోగం లేదని ఇష్టం వుండదు. రెండోసారి మళ్ళీ వెళ్ళి తుల్పాన్ ని కలుద్దామనుకుంటాడు. వెనక నుంచి ఆమె జుట్టుని మాత్రమే చూడగలుగుతాడు. నావికులు తమ కలల్ని తమ యూనిఫామ్ కాలరు మీద బొమ్మగా గీసుకుంటారని తన కాలరు విప్పి తన కలను చూడమని తన కలల రాకుమారి అవమని కోరతాడు. కాని ఆస ప్రయత్నాలు ఫలించవు. తుల్పాన్ పై చదువులకు పట్నం వెళ్ళిందని తెలుస్తుంది.  ఆ విషయం అలా వుంటే తన బావ గొర్రెల మందలకు కాపుకాయటంలో పూర్తిగా నిమగ్నం కాలేకపోతాడు. పిల్ల గొర్రెలకు సపర్యలు చేయడం ఇబ్బందిగా వుంటుంది. ఇక్కడ తన కలలను నిజం కావని బోని సలహామేరకు పట్నం వెళ్దామని నశ్చయించుకుంటాడ. కాని తన తొబుట్టువు, ఆమె పిల్లల, భర్త అభిమానం కట్టిపడేస్తాయి.

నిర్మాణాంశాలు/ పుట్టుపూర్వోత్తరాలు:

ఈ సినిమాను పూర్తి చేయడనికి 4 ఏళ్ళు పట్టిందట. ఐనా తన vision ఏమాత్రం సడలకుండా తీయగలిగినందుకు జోహార్లు అర్పించకుండా వుండలేము. ఈ సినిమాలో సమల్ పాత్రధారి తప్ప ఎవరికి నటనానుభవం ఎవరికి లేదు. ఆస పాత్రధారి Askhat Kuchinchirekov అప్పటికి ఒక ఫిల్మ్ స్కూల్ విద్యార్థి. కొన్ని నెలల పాటు వెతికి మరీ ఈ ప్రదేశాన్ని చిత్రీకరణకు ఎన్నుకున్నారు. షూటింగ్ మొదలుపెట్టెకంటే ముందు నటులనందరినీ ఆ ప్రదేశంలో నివసించేలా చేసి ఆ తర్వాత  షూటింగ్ మొదలుపెట్టారు.  20% మాత్రమే ముందు చేసుకున్న script, మిగతా 80%  షూటింగ్ సమయంలో అప్పటి పరిస్థితులకు అనుగునంగా తయారు చేసుకున్నదేనని  దర్శకుడు Dvortsevoy ఒక ఇంటర్వూలో చెప్పుకున్నారు.

నటులందరూ కొత్తవారైనా ఎక్కడా వారి నటనలో లోపం కనిపించకుండా దర్శకుడు జాగ్రత్తలు తీసుకున్నాడు. చిన్న పిల్లతో రాబట్టిన అద్భుతం. అందరికన్నా చిన్న పిల్లాడు (5 ఏళ్ళ కన్నా తక్కువే అనుకుంటా) Nurzhigit Zhapabayev (సినిమా లో ఆ పాత్ర పరు నూక “Nuka”) తో చేయించిన విధానం అద్భుతం. ఈ సినిమాలో సమాల్ కూతురు, సమాల్ పాడిన పాటలు (సాహిత్యం అర్థం కాకున్నా) బాగా నచ్చాయి నాకు.

ఈ సినిమాకు మరో కలికితురాయి Jola Dylewska సినిమాటోగ్రఫి. ఆ ఎడారి వాతావరణంలో, గాలి దుమారంలో చిత్రీకరించిన దృశ్యాలు. చివరలో ఒక గొర్రెకు ఆస చేసే ప్రసవం కూడా మనల్ని కట్టి పడేస్తుంది.  కథ అంతా మన కళ్ళ ముందరే జరుగుతుందనే భ్రమకు లోనవుతాము. ఔత్సాహిక దర్శకులు నేర్చుకోవలసిన అంశాలు ఎన్నో వున్న చిత్రం.

“తుల్పాన్” (ఆస పెళ్ళి చేసుకోవాలనుకున్న అమ్మాయి పేరు) అంటే ఇంగ్లష్ లో Tulip. ఈ అంశాన్ని కూడా దర్శకుడు చిత్రీకరణలో వాడుకున్నాడు. తన కలలో ఆ అమ్మాయిని ఎంతగా ఊహించుకున్నాడని చూపించడానికి ఆస కాలరు పైన కలల చిత్రం మార్పు.

Tulpan-2 Tulpan-4

అలాగే ఎవరూ చూడనపుడు ఆస Tulip బొమ్మగీసి ఎవరో వస్తున్న చప్పుడు విని చెరిపేసే దృశ్యం నాకు బాగా అనిపించింది.

Tulpan-3

ఇక ఈ సినిమా గెలుచుకున్న అవార్డులు చాలా వున్నాయి. వాట్లో కొన్ని:

  • Cannes 2008 లో Prix Un Certain Regard విజేత
  • Oscar 2008 విదేశి చిత్రాల విభాగంలో కజాఖిస్థాన్  నుంచి అధికారిక నామినేషన్
  • Asia Pacific Screen Awards 2008 లో ఉత్తమ చిత్రం
  • గోవాలో జరిగిన ముఫ్ఫై తొమ్మిదివ ‘IFFI’ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో బంగారు నెమలి(గోల్డెన్‌ పీకాక్‌)

ఈ సినిమా trailor, దర్శకుడి ఇంటర్వ్యూలు ఇక్కడ చూడొచ్చు.