chaduvu

బాపు గారి మిత్రులైన శ్రీ గూటాల కృష్ణమూర్తి గారు వారి కొడుకు, కోడలు వారి పిల్లలను చూడడానకి లండన్ నుంచి ఇండియా వచ్చారు.  ఆయన చాలా పెద్దవారు. 80 ఏళ్ళు దాటాయి. ఈ వయసులో ప్రయాణం చేయటం కష్టమే. పైగా వారు ఇండియా రావడం చాలా అరుదు. వారొచ్చినపుడు వారిని కలిసే అవకాశం వదులుకోవద్దని వారి అపాయింట్మెంట్ తీసుకొని మార్చి ౩ (2009) న కలిసాను. ఆ సందర్భంగా వారు టంగుటూరి సూర్యకుమారితో వారికి వున్న పరిచయం గుర్తుచేసుకున్నారు (వీరే ఈ మధ్య 2008 లో సూర్యకుమారి గారిపై ఒక ఖరీదైన పుస్తకం ప్రచురించారు.).  పైన వున్న బొమ్మను గూటాల గారు సూర్యకుమారిగారికి చూపించినపుడు, ఈ ట్రిక్కు ముందే తెలిస్తే బాగా చదువుకోవాలన్న కోరిక కొంతవరకైనా తీరేదని అన్నారంట.

చదువుతున్నపుడు నిద్ర ఆపుకోలేక తల వాల్చడానికి ప్రయత్నిస్తే మేకుకు కట్టిన పిలక వల్ల అది సాధ్యపడదన్నమాట. ఈ బొమ్మను 1901 లోనే ఒక విదేశీ పత్రిక (The Harmsworth Magazine) ప్రచురించిందంట! గూటాల గారు తెచ్చిన ఆ బొమ్మ xerox copy యొక్క ఫోటో ఇది.

ప్రకటనలు