schweppesAd

సోడా పానియాలు తయారు చేసే Schweppes అను కంపెనీ కోసం ప్రముఖ సినీదర్శకుడు  శేఖర్ కపూర్ ఒక advertisemnet చేసారు. దాదాపు 1 నిమషం నిడివి గల ఈ Adలో హాలివుడ్ తార నికోల్ కిడ్ మాన్ (Nicole Kidman), బాలివుడ్ నటుడు అర్జున్ రాంపాల్, (స్లండాగ్ మిలియనీర్ లో నటించిన బాల తార) రుబీనా నటించారు. ఉదయపూర్ లోని “Lake Palace”లో నిర్మించారు. దృశ్యపరంగా బాగున్నా Ad అంతగా నచ్చలేదు నాకు. ప్రియుడి కన్నా కోలా మక్కువ అని చూపించాలనుకున్నారేమో. రుబీనాను తప్పకుండా Adలో చూపించాలని చూపించినట్టు వుంది. ఆ Ad ఇక్కడ చూడొచ్చు. Schweppes కంపెనీవి ఇంతకు ముందు వచ్చిన adలు ఇక్కడ, ఇక్కడా (నాకు ఇది నచ్చింది) చూడొచ్చు.

ప్రకటనలు