yesterday_film

“Yesterday”: నేను చూసిన మొదటి జులుభాష సినిమా. ఆఫ్రికా నేపథ్యంతో తీసినవి చూసినవి చూసాను కాని ఆఫ్రికా భాషలో తీసిన సినిమాను చూడటం ఇదే.  మే 1 న చూసాను.  ఈ సినిమా కథానాయకి పేరు “యెస్టర్‍డే” (ఒక సన్నివేశంలో “నేటి కన్నా నిన్నమిన్న అని మా నాన్న పెట్టిన పేరు” అని చెబుతుంది). టూకీగా కథ ఏంటంటే:

బడికి వెళ్ళే వయసున్న కూతురు “బ్యూటి” తో ఒక వూరిలో నివసిస్తున్న “యెస్టర్‍డే”కు జబ్బు చేస్తే డాక్టరును కలుస్తుంది.  ఏయిడ్స్ వుంది, నీ భర్తను కూడా పరీక్ష చేయాలంటుంది డాక్టరు.  Johannesberg గనుల్లో పని చేస్తున్న భర్త తిరిగి వస్తే వూళ్ళో వాళ్ళను ఎదురించి సపర్యలు చేస్తుంది. అంతే కాకుండా తన కూతురు బడికి వెళ్ళేదాకా తను బ్రతికే వుండాలని తపిస్తుంది.

సినిమా కథనం వడిగా లేదు కాని ఎక్కడా అంతగా బోరు కొట్టదు. నాకు నచ్చిన కొన్ని అంశాలు:

1. సినిమా మొదలులో  titles వస్తున్నపుడు వచ్చే నేపథ్యసంగీతం కొత్తగా వుంది. మామూలుగా స్వరాన్ని రాగాలాపనలో కాని పాటలో కానీ వింటాం. కానీ ఇక్కడ స్వరం వైవధ్యంగా వుపయోగించారు. సినిమాలో సంగీతం నాకు నచ్చింది.

2.  యెస్టర్‍డే డాక్టరును “ఇక నేను బ్రతకనా?” అడిగినపుడు, ఏమి dialogue పెట్టకుండా వాళ్ళిద్దరి close shot నుంచి medium shot తర్వాత long shot కి cut అవుతుంది.

౩. విషయం చెప్పాలని జొహాన్నెస్‍బర్గ్ లో భర్త పనిచేసే గనికి వెళ్తుంది.

భర్త: Beauty (కూతురు)కి ఏమయ్యింది?

యెస్టర్‍డే: ఏం కాలేదు. బానే వుంది

భర్త: మరి ఎందుకొచ్చావు?

యెస్టర్‍డే:నిన్ను కలవడానికి

భర్త:ఎందుకు?

[కట్ చేసి grinding మషీన్ చూపిస్తారు. కట్ చేసి కిటికిలోంచి వాళ్ళిద్దరి longshot. Foreground (కిటికీకి ఇవతల)లో గని సెక్యురిటీ గార్డు. భర్త ఆమెను కొడతావుంటాడు. పేపర్ చదువుతున్న గార్డు ఒకసారి వాళ్ళను చూసి మళ్ళీ పేపరు చూసుకుంటుంటాడు. సంగీతం fadeout అయి నిశ్శబ్దం.  మెల్లగా out of focus. Cut to medium shot: బస్ లో పెదవి పగిలిన యెస్టర్‍డే. ప్రయాణంలో పాత తీపి జ్ఞాపకాలు (“నేటి కన్నా నేడు మిన్న” అనిపిస్తుంది) నెమరు వేసుకుంటున్నట్టు ఒక montage]

4.యెస్టర్‍డే గా Leleti Khumalo నటన

ఈ సినిమా 2004 సంవత్సరపు Oscar Foreign Language Film పోటీకి Soth Africa నుంచి నామినేట్ చేయబడింది. ఇంకో అసక్తికరమైన విషయం: ఈ సినిమా నిర్మాతల్లో ఒకరు “అనంత్ సింగ్” (అవును ఒక భారతీయ నామం ). అనంత్ సింగ్ గత 15 ఏళ్ళలో 45 సినిమాలు తీసారంట.

ప్రకటనలు