సుందరకాండ షూటింగులో బాపు, ఛార్మిలతో నేను

సుందరకాండ షూటింగులో బాపు, ఛార్మిలతో నేను

బాపు అంటే తెలియని తెలుగు వారుండరు. బాపు బొమ్మ అనిపించుకోవాలని కోరుకోని తెలుగు అమ్మాయి వుండదు. బాపు పేరు లేకుండా తెలుగు సినీ చరిత్ర పూర్తి కాదు. ఆ బాపు చిత్ర సృష్టి రహస్యం తెలుసుకోవాలనే ప్రయత్నంతో బాపు గారి సినీ ప్రస్థానానికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నాను. చివరికి ఒక వీడియో డాక్యుమెంటరి మరియు ఒక పుస్తకం ప్రచురించాలని ఆశ. ఈ ప్రాజెక్టు (ఈ కార్యానికి నా మిత్రులు రవి శంకర్, శ్రీనివాస్ మరియు రాజేశ్ సహకరిస్తున్నారు) పైన ఒక డైరి లాగా వ్రాయడానికి ఈ బ్లాగ్ మొదలు పెట్టాను. అది ఇక్కడ చూడొచ్చు.