నాకు చాలా ఇష్టమైన దర్శకుడు మణిరత్నం. అమృత, సఖి, రోజా, బొంబాయి మౌనరాగం సినిమాలు మళ్ళీ మళ్ళీ చూస్తుంటాను. జూన్ లో విడుదల ఐన “రావణ్”కు ఎక్కువ విమర్శలు వచ్చాయి. అమితాబ్ బచ్చన్ తన twitterలో ఈ సినిమా గురించి వ్రాస్తూ editing సరిగ్గా లేకపోవటం వల్ల ఈ సినిమా అర్థం కాకుండా పోయిందన్నారు. లేదు తమిళంలో బాగా వచ్చింది అన్నారు (నటుడు విక్రమ్, కెమెరామాన్ సంతోష్ శివన్). రాజా సేన్ (rediff.comలో విమర్శకుడు) ఈ సినిమా రాం గోపాల్ వర్మ “ఆగ్”లాంటిది అని కొట్టిపారేసాడు.ఇంతగా చర్చ జరుగుతున్నకొద్దీ ఈ సినిమా చూడాలన్న ఉత్సాహం మరింత పెరిగింది. కొద్ది రోజుల క్రితమే హిందీ రావణ్ చూసాను. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని notes ఇక్కడ పెడ్తున్నాను:

(Spoilers వున్నాయి)
కథ మూల అంశం గురించి:

 1. సినిమాలో బీర రాగిణిని ఎందుకు kidnap చేయాల్సివచ్చిందో స్పష్టంగా లేదు. చంపుదామనే ఉద్దేశమే వుంటే పడవను ఢీకొట్టినపుడే చంపివుండాల్సింది. 14 గంటల తర్వాత చంపాలని ఎందుకు అనుకుంటాడో తెలియదు. ఆ 14 గంటలు సినిమా ముగిసేసరికి 14 రోజులవుతుంది. హరియా శాంతి కోసం దేవ్ (రాగిణి భర్త) దగ్గరకు వెళ్ళినపుడు చెప్పిన మాటలు వింటే అక్కడి గిరిజనుల మీద వున్న కేసులు ఎత్తివేయటానికి కిడ్నాప్ చేసినట్టు అనిపిస్తుంది. ఒకవేళ అదే ఉద్దేశం ఐతే, బీర కిడ్నాప్ చేసిన వెంటనే ఆ సందేశం పోలీసులకు  పంపి వుండాల్సింది. ఈ basic point సరిగ్గా establish కాలేదు.
 2. బీర – పోలీసులకు విలన్, గిరిజనులకు హీరో. అలా ఎందుకయ్యిందో dialoguesలో కాకుండా visualగా చూపిస్తే బాగుండేది. Dialoguesని ప్రేక్షకులు miss అయ్యే అవకాశం వుంది.
 3. దేవ్ కు జమునను పోలీసులు మానభంగం చేసినట్టు తెలియదా? తెలియకపోతే తెలుసుకోవలసిన అవసరం duty minded police officerకు లేదా. ఒకవేళ తెలిసివుంటే, తను action తీసుకోకపోవటానికి కారణం ఏమిటి? ఈ ప్రశ్నలకు సినిమాలో జవాబులు లేవు.
 4. బీర ఆగడాలు పోలీసులకు తెలిసి కూడా ఒక DSP officer భార్యకు police రక్షణ లేకుండా అడవులకు షికారు చేయడానికి ఎలా పంపించారు?
 5. దేవ్ కు సంజీవ్ (రామాయణంలో ని ఆంజనేయుడి తరహా పాత్ర) సహాయపడాల్సిన అవసరం ఏముంది?

సహేతుకంగా అనిపించని/అర్థం కాని ఇతర సన్నివేశాలు:

 1. పట్టణ వాసి ఐన రాగిణి రోజుల తరబడి వానలో తడిసినా ఏ జలుబు, జ్వరమ్ రాకపోవటం అర్థం కాలేదు. అసలు దీనిని (రాగిణి జబ్బుపడటం) కథలో ఇంకా బాగా వాడుకునే అవకాశం వుంది. బీర ఆమె ఆరోగ్యం బాగు పడటానికి సహాయపడినట్టు వుంటే బాగానే వుండేది.
 2. తమ పోలీసు బలగంలో ని రంజిత్ బీర మనిషి అని దేవ్ ఎలా గుర్తు పట్టాడో అర్థం కాలేదు.
 3. రాగిణి దేవుడి విగ్రహం దగ్గర మనసులో కాకుండా బయటకు ప్రార్థించటం.
 4. బీరా ను రావణుడితో పోల్చటం బలవంతంగా చేసినట్టు అనిపిస్తుంది. “దస్ సర్ వాలె” అని కావాలని చెప్పించినట్టుగా వుంది. raavan-thefilm.com siteలో పెట్టిన poster (పైన వున్న బొమ్మ)లో అభిషేక్ బచ్చన్ కు వివిధ వేషధారణలు వున్నట్టు వుంది. కాని అవి సినిమాలో కనిపించవు. బహుశా బిగ్ బి చెప్పినట్టు editingలో పోయాయేమో.
 5. బీర రాగిణిని కాల్చి చంపుదామనుకున్నపుడు రాగిణి కొండపైనుంచి లోయలోకి దూకుతుంది. ఆమె రక్షించటానికి బీర దూకినపుడు, బీర మనుషులు ఎక్కడ వున్నారు? ఒక రోజు అంతా బీర్, రాగిణి కనిపించకున్నా బీర మనుషులు వెతికినట్టు అనిపించదు. రాగిణి అంత ఎత్తు నుంచి దూకినా పెద్ద గాయాలు కావు, నుదురు మీద మాత్రం చిన్న గాటు పడుతుంది అంతే.

రామాయణం తరహా:
బీర = రావణుడు
దేవ్ = రాముడు
రాగిణి = సీత
హేమంత్ = లక్ష్మణుడు
జమున = శూర్పనఖ
హరియా = విభీషణుడు
మంగళ్ = కుంభకర్ణుడు
గద్ద (kidnap సమయంలో కనిపిస్తుంది) = జటాయు
లాల్ మాటి = లంక
సంజీవ్ = హనుమంతుడు

దర్శకత్వం:

 1. మొదటి సన్నివేశం (బీర కొండ మీది నుంచి dive చేయటం, రాగిణిని kidnap చేయటం) స్పష్టంగా అనిపించలేదు. పోలీసుల దహనం, రాగిణి kidnap parallelగా చూపించారు. ఐతే ఆ సన్నివేశంలొ బీర డప్పు కొట్టడం చూపించి అయోమయం కలిగించారు. ఎందుకంటే ఆ సమయంలో బీర dive చేసి తన పడవలో రాగిణిని kidnap చేయడనికి కూడా వెళ్తాడు. బీర డప్పు కొట్టే shot తీసి, తన పడవలోకి ఎక్కుతున్నట్టు తీస్తే బాగుండేదేమో.
 2. ఆ మొదటి సన్నివేశంలో నే రోడ్డుకు అడ్డంగా రాళ్ళు పెడ్తున్న చేతుల్లో, చిన్న గడ్డపార కనిపిస్తుంది. ఆ minute details మణిరత్నంకే చెల్లు.
 3. రాగిణిని బీర చంపుదామని కొండ పైకి తెచ్చినపుడు, “మై మర్నా నహి చాహితి” అని రాగిణి అనటం నచ్చలేదు. అలా కాకుండా, “నా చావును నీలాంటి రాక్షసుడికి అప్పగించను” లాంటి dialogue వుంటే బాగుండేదేమో.
 4. అడవిలొ గిరిజనుల ఇల్ల్లులు, రాగిణి ని బంధించిన ఒక రాతి బావి చూస్తుంటే Apocalyptoలోని అడివి సన్నివేశాలు గుర్తుకొచ్చాయి.
 5. సంజీవి తో పోలిసులు వెళ్ళినపుడు, చెట్టుకు కట్టబడిన ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఒక గిరిజనుడిని చెట్టుకు కట్టి హింసించాలని బీర ఎందుకు అనుకున్నాడు. బీర గిరిజనుల హీరో కాదా? బీర తను వెళ్ళిన దిశ చెప్పాలని వుంటే వేరే విధంగా చెప్పొచ్చు (ఉదా|| board పెట్టవచ్చు లెదా పెట్టించవచ్చు). ఆ సన్నివేశంలో రాగిణి photo చూపించి “రాగిణి హై ఉస్కే పాస్?” అని అడగటం చిత్రంగా అనిపించింది. బీర వెంట ఈ అమ్మాయి వుందా అడిగితే బాగుండేది.
 6. బీర ఊరు విడిచి (చెల్లి పెళ్లపుడు ఊళ్ళోనే కదా వున్నాడు) అడివికి ఎలా వచ్చాడు వగైరా visual చూపించివుండాల్సింది.
 7. సినిమా మొదట్లో (kidnap తర్వాత) వచ్చే titles idea బాగుంది
 8. దేవ్ కోసం రాగిణి అరుస్తున్నట్టు (రాగిణి కలలో) తీసిన సన్నివేశంలో dialogues చాలా crispగా వుంటే బాగుండేది.
 9. బీర, అతని మిత్రులు ముఖాలకు ఎందుకు రంగు వేసుకుంటారో తెలియదు. హరియా చనిపోయినపుడు పసుపు రాసుకోవటం, తేనె తీసేటప్పుడు బురద రాసుకోవట పర్వాలేదు కాని మిగతా సన్నివేశాలలో రంగుల అవసరం కనిపించలేదు (చూడ్డానికి మాత్రం కొత్తగా బాగున్నాయి)

Cinematography

 1. ఈ సినిమాకు cinematography పెద్ద asset. చాలా అందంగా చిత్రీకరించారు.
 2. రాగిణి kidnap ఐన తర్వాత కళ్ళకు గంతలు కట్టి తీసుకెళ్తున్నపుడు camera movements వల్ల ప్రేక్షకుడికి రాగిణి స్థితిని మరింత స్పష్టంగా తెలుస్తుంది.
 3. సంతోష్ శివన్ తన సినిమా Terroristలో చూపించిన closeup లాంటి shots ఈ సినిమాలో కూడా వున్నాయి (రాగిణి బీరను చంపడానికి ప్రయత్నించినపుడు, బీర వేలు రాగిణి కన్ను దగ్గరికి వచ్చి ఆగటం closeupలో).
 4. “కటా కటా బేచారా” పాటలో Steadicam movements బాగున్నాయనిపించింది
 5. వార్తా పత్రికలో రాగిణి, బీర, అతని దళసభ్యుల ఫోటోను సిగరెట్ తో కాల్చే shot బాగుంది. కాని, సిగరెట్ ను పేపర్ వెనకాల పెట్టి కాల్చినట్టు చూపించారు. బహుశా అది కేవలం shooting సౌలభ్యం కోసం చేసివుంటారు. ఎవరైనా పేపర్ చదువుతున్న వైపునుంచే ఆ పని చేస్తారు కదా.

Editing
బీర కొండ మీది నుంచి dive చేయటం, పోలీసులను ఉచ్చులోకి లాగటం inter cut చేసి చూపించటం బాగుంది. కొండ మీది నుంచి రాయి కింద పడటం, పోలీసులు బీర మనుషుల వలలో పడటం ఒక దాని తర్వాత ఒకటి చూపటం బాగుంది.

సంగీతం

 1. కొన్ని పాటలు ఇంతకు ముందే విన్నట్టుగా వున్నాయి (బహ్నాదే ముఝే పాట). ఐతే “జా ఉడ్ జారే”, “బీరా ” పాటలు చాలా నచ్చాయి. ఖిలీ రే పాటా కూడా బాగుంది.
 2. Tension buildup చేయటానికి background musicలో vocalsని వాడిన విధానం బాగుంది (రంజిత్ తో పోలీసులు బీర స్థావరానికి వెళ్తున్నపుడు).
 3. ఈ సినిమాలో ఔద్ (Oud) అను ఒక అరబిక్ వాయిద్యం వాడారంట. అది వాయించింది మన తెలుగు వాడే అదృష్ట దీపక్ (ఇతకి Sound Engineer మరియు Mixing Engineer credits కూడా ఇచ్చారు).
 4. బీర, రాగిణి కలుసుకున్నపుడు వినపడే leitmotif చాలా నచ్చింది.
 5. బీర DSP campలో బాంబులు వేసినపుడు, బీర లోయలో పడి చనిపోయినపుడు వినపడే background music బాగుంది.
 6. రహమాన్ ఈ మధ్య ఎక్కువ Sufi music చేస్తున్నారు. ఈ సినిమాలో కూడా ఎక్కువ అలాగే అనిపిస్తుంది.

నటన

 1. ఐశ్వర్య రాయ్ బాగా కష్టపడి చేసిన సిన్మా ఇది. కొండ ఎక్కే shot నిజంగా risky shot.
 2. ఇక నటనా పరంగా నాకు విక్రమ్, ప్రియమణులు చాలా నచ్చారు. విక్రమ్ dialogue delivery కూడా బాగుంది.

నిర్మాణం:
ఈ సినిమా పైన డబ్బు పెట్టిన వారు, మద్రాస్ టాకీస్,Reliance Entertainment. Titlesలో మాత్రం నిర్మాతల పేర్లు “మణిరత్నం, శారదా త్రిలోక్ (ఈవిడ మణిరత్నం గారి cousin)” అని వేసారు. ఈ సినిమాకు story boarding credit కూడా వేసారు: Vihang Walve – Story Board artist. ఇంకో ఆసక్తికరమైన అంశం: titlesలో Project Insurance చేసినట్టు వేసారు. ఎలాంటి insurance చేసారో తెలుసుకోవాలి.

తర్వాత….

మణిరత్నం తన తర్వాతి చిత్రంపైన పనిచేయటం మొదలుపెట్టారంట. Weekలో వచ్చిన ఈ వ్యాసంలో పేర్కొన్న (మణిరత్నం చదివే) తమిళ రచయతలు అంబై, G. నాగరాజన్ ల రచనల కోసం వెతికాను. కాని దొరకలేదు. ఐతే ఒక ఆసక్తికరమైన link దొరికింది.

Amores Perros, Babel, 21 Grams మరియు ఈసారి Cannesలో ప్రదర్శింపబడ్డ Biutiful సినిమా దర్శకుడు Alejandro González Iñárritu ఇటీవల చేసిన Nike Ad ఇది. తప్పక చూడవలసినది.

ఇన్నాళ్ళు, steadicam వాడిన మొదటి సినిమా 1989లో వచ్చిన రాంగోపాల్ వర్మ “శివ” అనుకుంటూవచ్చాను.  ఈ రోజు (మే 2) ఆంధ్రజ్యోతి నవ్యలో ప్రచురింపబడ్డ ఇంటర్వ్యూలో దాసరి గారు సినిమా టెక్నిక్ గురించి మాట్లాడుతూ steadicamను మేఘసందేశంలో వాడానని చెప్పారు. “మేఘసందేశం సినిమాను స్టడీ కెమెరాతో తీశాను. ట్రాలీ, క్రేన్, జూమ్ ఇవేమి వాడలేదు. దీనిని ఇక్కడ ప్రేక్షకులు, మీడియా గుర్తించలేదు. మాస్కో ఫిలిం ఫెస్టివల్‌కు వెళ్లినప్పుడు- అక్కడ ఒకరు ఈ విషయం మీద రివ్యూ రాశారు. టెక్నిక్ అనేది రూపాన్ని మార్చేయకూడదు.”

Reference:

http://www.andhrajyothy.com/navyaNewsShow.asp?qry=2010/may/2/navya/2navya1&more=2010/may/2/navya/navyamain&date=2/5/2010

చాలా మంది ఆర్టిస్టులకు అభిమాన ఆర్టిస్ట్ ఐన Norman Rockwell ఒకసారి ఇండియా వచ్చాడు. 1962లో తమ పత్రిక ముఖచిత్రం కోసం అప్పటి భారతదేశ ప్రధాని జవహర్ లాల్ నెహ్రు portrait వేయవలసిన బాధ్యతను Saturday Evening Post వారు Norman Rockwellకు అప్పగించారు. (మరింత…)

ప్రసిద్ధ తెలుగు filmmaker (దీనికి తెలుగు పదం ఏమిటో) శ్రీ ఎల్వీ ప్రసాద్ జీవిత చరిత్రను “వెండితెర వరప్రసాదం” పేరుతో నవ్య వారపత్రిక వారు ధారావాహికంగా ప్రచురిస్తున్నారు. మార్చి 17 సంచికతో మొదలయ్యింది.  రచయత ఓలేటి శ్రీనివాస భాను. ఎందరికో స్పూర్తినిచ్చే ఆయన జీవితం గురించి తెలుసుకోవడం ఇప్పుడు మరింత సుళువు. ఎందుకంటే, ఇప్పుడు నవ్య వారపత్రిక onlineలో లభ్యం: http://www.navyaweekly.com/ (మరో మంచి విషయమేమిటంటే online ప్రచురణ మార్చి 17వ సంచికతోనే మొదలయ్యింది).