అవతార్ లో వున్న CG charactersకి అంతకు ముందు వచ్చిన motion capture animation సినిమాల్లోని రబ్బరు బొమ్మల్లాంటి CG charactersకి తేడా ఏంటోనని internetలో వెతకటం ప్రారంభించాను. నాకు లభించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు:
1. అవతార్ లో CG పాత్రలు rubber balloonsలాగా వుండి కీళ్ల దగ్గర మాత్రమే కదలికలు వుండే లాగా కాకుండా మనిషిలో వుండే కండరాలు, కొవ్వు మరియు tissuesని కూడా model చేసారు
2. చర్మం రంగు అంతా uniformగా వుంచేయకుండా ఆ నీలం రంగులో (కళ్ళ దగ్గర darkగా, చెంపలపైన lightగా, పెదవులు pinkishగా) రకరకాల shades వాడారు
3. చర్మం texture smoothగా వుంచకుండా కొంచం గరుకుగా కనిపించేలాగా, skin poresని కూడా model చేసారు.
4. ఇంత చేసిన తర్వాత ఈ organic blue coloured CG character మంటల వెలుగులో (orange రంగు వెలుగులో)  gray colourలో అసహ్యంగా కనిపిస్తున్నాయని Na’viల పైన బడి reflect అయ్యే light ని “spectral compensation” ద్వారా మార్చారు
5. ఇంకా చర్మానికి కొత్త subsurface model వాడారు. దీని వల్ల చర్మం క్రింద ప్రవహించే రక్తం రంగు వల్ల చర్మం రంగు (నీలం రంగు)కు ఒక విధమైన shade వస్తుంది.

ఇలా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నందు వల్ల Na’viల చర్మం rubberలాగా అనిపించకుండా organicగా అనిపిస్తుంది.

New year day రోజు జనవరి ఒకటిన TV ఛానెళ్ళు మార్చి మార్చి చూస్తున్నపుడు (ఉదయం 9.30 గంటల ప్రాంతాన) TV9లో ఒక కార్యక్రమం ప్రసారమవుతోంది. ఆ కార్యక్రమంలో  ఇలియానా గీసిన బొమ్మలు చూపిస్తున్నారు. గ్లామర్ నటి ఇలియానా ఒక artist అని అప్పుడే తెలిసింది.  పైన వున్న బొమ్మలు ఇలియానా వేసినవే. బొమ్మలతో పాటు ఆమె సంతకం కూడా చూడొచ్చు.

గాంధిఫోటోలు ఒక రకమైన ప్రేరణ, ఉత్సాహం ఇస్తాయి నాకు.  అందుకే గాంధి పైన లభించే వీడియోలు సేకరించాను, సేకరిస్తున్నాను. కొన్ని photo albums కూడా కొన్నాను. వాటిల్లో నాకు చాలా ఇష్టమైన పస్తకం Phaidon వారు ప్రచురించిన “Gandhi: A Photo Biography“.  అప్పుడప్పుడు ఈ పుస్తకం తిరగేయటం నాకు చాలా ఇష్టం. మానవతా విలువల పట్ల తనకున్న అంకిత భావంతో ప్రపంచాన్నే జయించిన నేత గాంధి. పైన వున్న బొమ్మ Noel Douglas Sickles అను ఒక అమెరికన్ కార్టూనిస్ట్, ఆర్టిస్ట్ వేసిన cartoon (1930ల్లో వేసింది). సందర్భం ఏమిటో తెలియదు (తెలిస్తే చెప్పండి).

Gandhi: A Photo Biography

నా దృష్టిలో సినిమాకు script వ్రాయటం చాలా కష్టమైన పని. గొప్ప దర్శకులు ఆ వ్రాత పని ఎలా చేస్తారనే కుతూహలం వుంటుంది నాకు.  ఈ మధ్యనే “Madeo” సినిమా దర్శకుడి ఇంటర్వ్యూలు కొన్ని చదివాను. వాటిల్లోంచి కొన్ని ఆసక్తికరమైన విషయాలు:

1. నేను దర్శకత్వం వహించిన సినిమాలన్నీ నేను వ్రాసుకున్నవే. ఐతే ఇతర రచయతల సాయం తీసుకుంటా. నేను ఒక్క  ప్రదశంలోనే కూచుని వ్రాయలేను. Script writing ప్రక్రియ చాలా కష్టమైంది నాకు.  నేను regularగా వెళ్ళే cafeలకు coffe shopలకు వెళ్తాను.  అక్కడ ఒక మూలలో నా computer connect చేసుకుని పనిచేసుకుంటా. ఎన్ని రణ గొణ ధ్వనులున్నా పని చేసుకోగలను. ఆ పరిసరాలే నన్ను ప్రేరేపిస్తాయి. ఒక్కోసారి వారాలు నెలలు వ్రాయలేను. అప్పుడు నాకు ఇష్టమైన సినిమాలన్నీ చూస్తా. ఆ సినిమాలకు నా సినిమా కథకు సంబంధం ఏమీ లేకున్నా నేను చిన్నప్పుడు ఇష్టపడ్డ ఆ సినిమాలను చూస్తా. ఒక్కోసారి ఒక 10 లేదా 20 DVDలు తీసుకొని వాటిల్లో నాకు ఇష్టమైన సీన్లన్నీ చూస్తా.  Writers block నుండి బయట పడటానికి ఇవన్నీ తోడ్పడతాయి.

2. Madeo (Mother) సినిమా గురించి: 2004లో అనుకున్న కథ ఇది (2009 లో విడుదలయ్యింది). తల్లి పాత్రలో నటించిన Hye-ja Kim మా దేశంలో ప్రఖ్యాత నటి. ఆవిడ నటన ప్రపంచానికి చూపెట్టటానికే ఈ సినిమా చేయటానికి ప్రేరణ.

3. Alan Moore comics కి నేను పెద్ద అభిమానిని. Alan Moore comic “From Hell” నా “Memories of a Murderer”కి ప్రేరణ.

4. తదుపరి చిత్రం Chan-wook Park (Old boy దర్శకుడు) నిర్మిస్తున్నారు. “Transperceneige” అను science fiction graphic novel ఆధారంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. 2012 కల్లా విడదల అయ్యే అవకాశం వుంది.

References:

1. http://www.collider.com/entertainment/archive_detail.asp/aid/3718/cid/13/tcid/1

2. http://www.collider.com/entertainment/interviews/article.asp?aid=11293&tcid=1

బొమ్మ-1

Digital సినిమాకు అవసరమయ్యే resolution గురించి, మన కన్ను గ్రహించే resolution గురించి ఇంతకు ముందు వ్రాసుకున్నాను. ఆ పాత టపాలు:

1. Film resolution ఎంత?
2. RED resolution సరిపోతుందా?
3. మనిషి కన్ను మరియు డిజిటల్ కెమెరా పరిధి

ఐతే Apocalypto మరియు 28 Days Later సినిమాలకు HD camera మాత్రమే వాడారు. ఐనా cinema theatreలో ప్రేక్షకులు ఎలా చూసారు? HD resolution సరిపోదని ఇంతకు ముందు వ్రాసిన టపాలో వేసిన లెక్కలను బట్టి  అనుకున్నాను. మరి ప్రేక్షకులు low quality videoను ఎలా ఆదరించారు. నేను ఆ రెండు సినిమాలు theatreలో చూడలేదు మరి. ఇన్నాళ్ళు ఆ ప్రశ్న నన్ను వెంటాడుతూవచ్చింది.

ఈ మధ్యనే నా మిత్రుడు ఆనంద్ చూపించిన వ్యాసం ఒకటి చదివాను. ఆ వ్యాసం John Galt అను ఒక Digital Imaging expert (ఇతనే ప్రఖ్యాత camera design and rental company Panavisionకి Senior Vice President కూడా) వ్రాసింది. ఈ వ్యాసంలో నేను గ్రహించిన 3 ముఖ్యమైన విషయాలు:

1. theatre లాంటి ambient light (పరిసర కాంతి) level లో మన కన్ను ఎక్కువ resolution గ్రహించలేదు
2. resolution తక్కువ వున్నా frame rate ఎక్కువ వుంటే video quality కంటికి బాగుంటుంది. 24 fps (frames per second)తో తీసిన వీడియో కన్నా 48fpsతో తీసిన వీడియో quality ఎక్కువనిపిస్తుంది (ఆ వీడియో లో కదలికలు ఎక్కువగా వుంటే).
3. high dynamic range imaging వల్ల quality మరింత పెంచవచ్చు. దీని కోసం Panavision వాళ్ళు Dynamax అని ఒక కొత్త sensor technology రూపొందిస్తున్నారు.

ఐతే నన్ను వెంటాడిన ప్రశ్న( ప్రేక్షకులు low quality videoను ఎలా ఆదరించారు?)కు సమాధానం పైన వ్రాసిన మొదటి pointలో వున్నట్టు అనిపించింది. ఆ విషయం గురించి తెలుసుకోవాలని Google లో వెతికాను. నాకు లభించిన సమాచార సారాంశం ఇది. మనిషి చూపు మన పరిసర కాంతితో మారుతుంది. ఇది మూడు రకాలుగా వుంటుందని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు.

1. Photopic: ఎక్కువ పరిసర కాంతి
2. Scotopic: తక్కువ కాంతి (రంగులు కనిపించవు)
3. Mesopic: మధ్యస్థంగా వుండే కాంతి.

కాంతి తీక్షణతను బట్టి మన కంటి rods and cones activity మారుతుంది (బొమ్మ-1). Theatreలో మనకు వుండే చూపు mesopic చూపు. Contrast గ్రహించే శక్తి కూడా ఈ మూడు చూపుల్లో భిన్నంగా వుంటుంది. Photopic లో తక్కువ contrastను కూడా గ్రహించే శక్తి వుంటే scotopicలో contrast ఎక్కువ వుంటే గానీ మనం గ్రహించలేము. ఈ contrast sensitivity బొమ్మ-2 లో చూడొచ్చు.x-axisలో వున్న cycles/degree కంటిలో ఏర్పడే బొమ్మ size. y-axis నలుపు ఎంత నలుపో తెలుపు ఎంత తెలుపో తెలుపుతుంది. cycles/degree ని అర్థం చేసుకోవటానికి బొమ్మ-3 చూడొచ్చు.

బొమ్మ-2

ఉదాహరణకు 10 cycles/degree size (అంటే )తో కంటిలో ఏర్పడే బొమ్మకు photopicలో కనీసం 0.5% contrast కావాలి. 100% contrast వున్నా (అంటే నలుపు పూర్తి నలుపు తెలుపు పూర్తి తెలుపు)

బొమ్మ-3

కన్ను60cycles/degree size (అంటే రెటినాపై 1/60 degrees కోణం ఏర్పరిచే బొమ్మ) వున్న బొమ్మనే చూడగలుగుతుంది mesopic mode లో. ఇక mesopic modeలో కన్ను గ్రహించే అత్యల్ప contrast (బొమ్మ-2) 0.9%. ఆ 0.9% contrastతో ఆ బొమ్మ కంట్లో కనీసం 1/6 degree (6 cycles/degree) కోణం ఏర్పాటు చేయాలి. Pixelకి Pixelకి మధ్య (అసలుకైతే Macroblockకి Macroblockకి మధ్య; Macroblock అంటే 16×16 pixels) contrast 0.9% కన్నా తక్కువ వుండేలా చూసుకుంటే (video coding లో loop filter ద్వారా ఇది control చేయొచ్చు), మన resolution requirement లెక్క మారిపోతుంది.

N > 1.2/ (tan[1/12])

=> N > 825

అంటే వీడియో resolution 1466×825 వుంటే theatreలో చూడాటానికి సరిపోతుంది. HD resolution 1920×1088 దాని కన్నా ఎక్కువ కనుక ప్రేక్షకులు ఆ సిన్మాలన్నీ theatreలో చూడగలిగారు.

References:

1. http://www.telescope-optics.net/aberrations_extended.htm

తరువాతి కాగితం »